Sarkaru Vaari Paata: తొలి రోజు కుమ్మేసిన సర్కారు వారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో వీకెండ్ వరకు ఈ సినిమాకు టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా రూ.36.63 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
వెండితెరపై మహేష్ బాబు సినిమా విడుదలై రెండు సంవత్సరాల నాలుగు నెలలు దాటింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ చూడని విధంగా మహేష్ ఎనర్జిటిక్, స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించడంతో అతడిని చూసేందుకు అభిమానులు సర్కారు వారి పాట సినిమాకు బారులు తీరుతున్నారు. మరోవైపు మహేష్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, కామిక్ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ‘నాన్ రాజమౌళి'(బాహుబలి, ఆర్.ఆర్.ఆర్) సినిమాల్లో ఆల్‌టైం రికార్డు సృష్టించింది.
Also Read
- Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి 'టాయ్ స్టోరీ' 5 వరకు..
- Hema Slams Anasuya: 'జై శ్రీరామ్' ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు... అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
- Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
తొలిరోజు ఏపీ, తెలంగాణలో సర్కారు వారి పాట మూవీ షేర్లు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా నైజాంలో రూ.12.24 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. గుంటూరులో రూ.5.83 కోట్లు, సీడెడ్‌లో రూ.4.7 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.73 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.3.25 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.3 కోట్లు, కృష్ణాలో రూ.2.58 కోట్లు, నెల్లూరులో రూ.1.56 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు పేర్కొంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

తాజావార్తలు
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!