ఏపీ పదో తరగతి ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయితే.. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అయితే.. ఆ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అయితే.. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు అందులో బాటులో ఉంటాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది ఈ పరీక్షలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన విషయం తెలిసిందే.. కరోనా పరిస్థితుల కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులు ఇంటర్ కు ప్రమోట్ అయ్యారు.
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 6 లక్షల 2 1వేల 799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. ఈసారి మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. అయితే అనుకున్న టైం ప్రకారం.. అంటే కేవలం 25 రోజుల్లో.. రికార్డు స్థాయిలో విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి.