నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 20 ఏళ్లుగా సుదీర్ఘంగా మంత్రిగా పనిచేసే మచ్చలేని నాయకుడిగా మిగిలిన నేత జానారెడ్డి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాళ్ళు మొక్కి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని జానారెడ్డిని కేసీఆర్ వేడుకున్నారు.. జానారెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడింది.. తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసింది అని రేవంత్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే.. మలిదశ ఉద్యమంలో పదవి త్యాగం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని టీపీసీసీ చీఫ్ అన్నారు.
Also Read : Amit Shah: బీజేపీకి వేసే ప్రతీ ఓటు పీఎఫ్ఐ నుంచి కర్ణాటకను కాపాడుతుంది..
దళిత బంధు పేరుమీద 3 లక్షలు.. 30% కమిషన్ తీసుకుంటున్న సర్కార్ మనకు అవసరమా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో లక్షలాది మంది యువకులు ఉద్యోగాలు ఉపాధి లేక తలడిల్లుతున్నారు.. ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్ లో యువత అష్టకష్టాలు పడుతుందన్నారు. ఓవైపు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రంలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నాడు అని రేవంత్ రెడ్డి తెలిపాడు.
Also Read : Chandrababu: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. ‘స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్’ పేరుతో ఎన్టీఆర్ విగ్రహం
తాగుబోతుల అడ్డాగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మారినాయి అని టీపీసీసీ చీఫ్ అన్నారు. నల్లగొండ బిడ్డలు నడుం బిగిస్తే.. రాష్ట్రంలో మార్పు కాయం.. రాష్ట్రంలో అందరి జీవితాలలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు గెలిస్తే వేదిక పైన ఉన్న పెద్దలు రాష్ట్రంలో 90% సీట్లు గెలిపిస్తారు అని పేర్కొన్నారు.
Also Read : CM YS Jagan: మేలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కీలక పర్యటనలు
నకిరేకల్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారు అని రేవంత్ రెడ్డి అన్నారు. కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేలు ఖాళీ స్థలం కనబడితే కబ్జాలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. ల్యాండ్, సాండ్, వైన్, మైనింగ్ దందాలకు కేరాఫ్ గా నల్గొండ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మారారు అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : CM YS Jagan: మేలో కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కీలక పర్యటనలు
కాంగ్రెస్ పార్టీ తరపున మేము కొట్లాడితే 80 వేల పోస్టులకు కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్ లు ఇచ్చింది అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులకు పరీక్షలు పెట్టమంటే ప్రశ్నాపత్రాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకుంటున్నారు.. పోటీ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.