నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో మాజీ సీఎల్పి నేత జానారెడ్డి పాల్గొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను, నిరుద్యోగులను చూస్తుంటే మా హృదయాలు పరవశిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అగ్రభాగాన ఉండి కొట్లాడారు.. మా పోరాటం వల్లే తెలంగాణ వచ్చింది కేసీఆర్ సీఎం అయ్యారు అని జానారెడ్డి అన్నారు.
Also Read : Komatireddy Venkat Reddy : ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు..
మిమ్మల్ని చూస్తుంటే నల్లగొండ జిల్లాలో 12 సీట్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలుగుతుంది అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఇదే ఐక్యత కాంగ్రెస్ పార్టీలో కొనసాగించి తెలంగాణలో అధికారంలోకి రావడానికి మాత్రమే కాదు ఢిల్లీలో కూడా మన ఐక్యత ఆదర్శంగా ఉండాలి అని జానారెడ్డి తెలిపారు. ఉపన్యాసం ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు… అందరినీ కలిపి ఉత్తేజపరిచేందుకే ఇక్కడికి వచ్చాను అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు.
Also Read : LSG vs PBKS: విధ్వంసం సృష్టించిన లక్నో జట్టు.. పంజాబ్ ముందు అతి భారీ లక్ష్యం
అధికార అహంకారంతో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాoలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ జిల్లాలో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా ఆధనంగా నీరు ఇవ్వలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ల అమలు తీర్మానం చేసి వదిలేసారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. అలాగే రైతులకు 5 వేలు రైతుబంధు ఇచ్చి.. 50 వేల రూపాయలను టాక్స్ రూపంలో కేసీఆర్ వసూలు చేస్తున్నాడు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పండి అని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.