టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్ కి వివరించాను.. అలాగే, వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని మనవి చేశాను.. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Mahesh Goud : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కరాటే బ్లాక్ బెల్టు అందుకున్నారు. ఏకంగా మూడు గంటల పాటు టెస్టుల్లో పాల్గొని ఆయన ఈ ఘనత సాధించారు. మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయాల్లోనే కాకుండా కరాటేలో కూడా తన సత్తా ఏంటో ఈ సందర్భంగా చూపించేశారు. సాధారణంగా యంగ్ ఏజ్ లో ఉన్న వారికి కరాటే బెల్టు వస్తే పర్లేదు గానీ.. మహేశ్ గౌడ్ కు ఈ వయసులో కూడా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ…
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్ తమకు దేవుడు లెక్క అని, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. Also…
కులగణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలన్నారు.
TPCC Chief Mahesh Goud: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం, ఓట్ల బిక్షాటన చేస్తున్నారు అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానం పెద్దలను కలిసి తనను అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు.
గత కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్‌కు ఎవరు సారథ్యం వహించబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఒక బీసీ నేతను టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
ఈరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. నేడు వరంగల్ పర్యటన ఉన్నా.. తన టూర్ ను వాయిదా వేసుకుని హస్తినలోనే ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సహా.. డిప్యూట సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ భేటీ అయ్యారు. తెలంగాణ…
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వివాదంపై సీఈఓ చర్యలు తీసుకోవాలి అని కోరారు. కావాలనే వ్యూహాత్మకంగా ఈ వివాదం సృష్టించారు..