Peddi Sudarshan Reddy comments: తెలంగాణ ప్రభుత్వం సాగు, తాగు నీటి సౌకర్యాలను కల్పించిందని..దీంతో తెలంగాణ వ్యాప్తంగా పంటల దిగుబడి పెరిగిందని, వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా గోదావరి జలాలతో పంటల దిగుబడి గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. సంక్రాంతి పండగ సందర్భంగా నర్సంపేటలో శాంతిసేన రైతు సంఘం నిర్వహించిన పశువుల అందాల పోటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Read Also: Harish Rao: బీజేపీ హటావో.. సింగరేణి బచావో
నియోజకవర్గంలో పాడిపంటలు, పశు సంపదను పెంపొందించడానికి కృషి చేస్తానని వెల్లడించారు. నియోజకవర్గంలోని పాకాల, రంగాయ చెరువు, మదన్నపేట చెరువులను గోదావరి నదులను నింపడం వల్ల పంట దిగుబడి పెరిగిందన్నారు. రైతు సంఘాలతో ఎఫ్పీఓలను ఏర్పాటు చేసి విత్తన ఉత్పత్తి యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. పంట కొనుగోలు చేపపట్టడం, ధాన్యం నిల్వల కోసం లక్ష టన్నుల గోదాంలను ప్రభుత్వం నిర్మించిందని వెల్లడించారు.
ఈ అందాల పోటీలో అన్ని రకాల పశువులు, పెంపుడు జంతువులు, రైతులు కూడా పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు.