Harish Rao: ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ హటావో సింగరేణి బచావో నినాదంతో బి.ఆర్.ఎస్ కార్యకర్తలు పని చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఛాన్స్ లేదని బీజేపీలో ఎవరైనా చేరితే అది ఆత్మహత్య సదృశ్యం మాత్రమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీలోకి ఎవరైనా వెళ్తారంటే వారు రాజకీయాలకు దూరమైతారని ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఎటువంటి అవకాశాలు ఇక్కడి ప్రజలు ఇవ్వరని హరీష్ రావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం సింగరేణి అమ్మేందుకు అనేక కుట్రలు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పే దానిలో నిజాలు లేవని పార్లమెంట్లో కేంద్రమంత్రి చేసిన ప్రకటన స్పష్టం అవుతుందని హరీష్ రావు అన్నారు. సింగరేణి అప్పుల ఊబిలో తీసుకెళ్లి అమ్మేస్తుందని అన్నారు. అప్పుల ఊబిలోకి నెట్టి దానిని ఆదానికి అమ్మేస్తుందని హరీష్ రావు ఆరోపించారు.
Read also: Anand Mahindra: నాటు నాటు అంత ఎనర్జీలేదు.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
దేశంలోనే బీజేపీ హటావో నినాదంతో మనం ముందుకు వెళ్లాలని బీజేపీని హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి పలువురు నేతలు బీజేపీకి వెళ్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో హరీష్ రావు ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇల్లందులో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పండుగలు పబ్బాలని వదిలేసి 18న జరిగే భారీ బహిరంగ సభకి హాజరుకావాలని అన్నారు. మనము అడగని అభివృద్ధి పథకాలను కూడా కేసీఆర్ మనకు కల్పిస్తున్నారు. ఏ సమస్య ఉన్న అది పరిష్కారం చేస్తారు అన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ప్రజలు ఎలా పనిచేశారో, వారి గురించి ఎలా చెప్పకుంటామో అన్న విధంగా బీఆర్ఎస్ సభ గురించి మన పనితనం ఆ విధంగా ఉండాలని తుమ్మల నాగేశ్వర అన్నారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రేగా కాంతారావులు పాల్గొన్నారు.
China Manja: నాగోల్ చిన్నారి మాంజా ఘటన.. చైతన్యపురి సీఐ సీరియస్ వార్నింగ్