నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలువద్దనే కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీకి దిగారని తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ అని విమర్శలు గుప్పించారు.
Read Also: Thandel: ‘తండేల్’ అంటే అర్ధం ఏంటో తెలుసా.. ?
ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎమ్మెల్యేలంతా అవినీతిపరులేనని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ బీజేపీ అని తెలిపారు. కేసీఆర్ మోసగాడు… కేటీఆర్ పెద్దమోసగాడు విమర్శలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా వారు అనేక అబద్దాలు చెప్పారని అన్నారు. బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని నడిపే కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని రాజాసింగ్ ఆరోపించారు.
Read Also: Viral News : బొమ్మను పెళ్లి చేసుకున్న మహిళ.. ఇప్పుడు బిడ్డను కూడా.. ఇదేం విచిత్రం భయ్యా..
కేసీఆర్, కేటీఆర్ లు ఎంఐఎం కాళ్ళు పట్టుకునే అవసరం ఏముందని రాజాసింగ్ ప్రశ్నించారు. ఓవైసీలు నడిపే దక్కన్ కాలేజీ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా.. హైద్రాబాద్ ఓల్డ్ సిటీ మినీ పాకిస్తాన్ గా మారిందని అన్నారు. ఓవైసీ బ్రదర్స్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. ఓవైసి బ్రదర్స్ ని పాకిస్తాన్ కు తరిమేస్తామన్నారు రాజాసింగ్.