national book fair begin in ntr stadium: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 35వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. పుస్తకాలతోనే సమాజంలో మార్పు వస్తుందని మంత్రి అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక పఠనం, పుస్తక పరిజ్ఞానం శాశ్వతమన్నారు. సెల్ ఫోన్ ద్వారా మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం జరుగుతుందన్నారు. దాన్ని అధిగమించాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. చరిత్రను వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మబలిదానాలు, ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని పుస్తకంలో పొందుపరిచామన్నారు. విద్యార్థులు చరిత్ర పుస్తకాలు చదవాలని సూచించారు.
Read also: Terrorists arrested: కశ్మీర్‌లో ఐదుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు అరెస్ట్
తొలిరోజు పుస్తక ప్రదర్శనలో పుస్తక ప్రియులతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టాళ్ల వద్ద సందడి నెలకొంది.ఈ పుస్తక ప్రదర్శనలో 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు. బాలసాహిత్యం, ఆధ్యాత్మికత, వ్యక్తిత్వ వికాసం, ప్రముఖుల జీవిత చరిత్రలతో పాటు వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి. స్టాల్‌లో కేసీఆర్‌పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ఉప్పెన, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూతో సహా ఇతర భారతీయ భాషలలో సాహిత్యం అలాగే నవలలు, కథలు, సైన్స్ మరియు టెక్నాలజీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి స్టడీ మెటీరియల్స్, వివిధ ప్రచురణలకు సంబంధించిన పుస్తకాలు ఎగ్జిబిషన్‌లో అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన వచ్చే నెల జనవరి 1 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
Kaikala Satyanarayana: తన ఊరంటే కైకాలకు ఎంతో ప్రేమ.. కౌతవరంలో విషాదఛాయలు