విలక్షణ నటుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసం తుదిశ్వాస విడిచారు. దీంతో.. ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ అకాల మరణంతో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో.. ఆయన బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.. కైకాల మరణ వార్త తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు చివరి సారిగా కైకాల భౌతికకాయాన్ని చూసేందుకు హైదరాబాద్ కు పయనమయ్యారు. చిన్ననాటి నుంచి నటనపై వున్న ఆసక్తితో ఎవరి ప్రోత్సహం లేకుండానే సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారని, అంతటి స్థాయికి వెళ్ళిన స్వగ్రామం గురించీ ఎప్పుడు అడిగేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. కౌతవరం గ్రామానికి రోడ్డు, శాశ్వతంగా అంబులెన్స్, కైకాల విగ్రహం ఏర్పాటు చేసి తన చివరి కోర్కెను తిర్చలంటున్నారు కుటుంబ సభ్యులు.
Read Also: TSPSC Group-4: గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన కైకాలకు ఆయన స్వగ్రామం అంటే.. ఎంతో ప్రీతి.. లక్షలాది రూపాయల సొంత నిధులతో కౌతవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కైకాల.. తన గ్రామంలో ఉన్న చెరువులో చేపలను చాలా ఇష్టంగా తినేవారు కైకాల.. గ్రామంలో ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేసిన ఆయన.. రోడ్లు, చెరువుగట్టు అభివృద్ధి లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకున్నారు.. నటుడిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నా ఆయనకు.. ఆ గ్రామం అంటే అమితమైన ప్రేమ అని స్థానికులు చెబుతున్నారు.. కైకాల సేవలను గుర్తించి గ్రామంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. కాగా, కృష్ణా జిల్లాలో 1935 జులై 25న జన్మించారు కైకాల సత్యనారాయణ.. గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడైన ఆయన.. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మను వివాహం చేసుకున్నారు.. కైకాలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.. నవరస నటనా సార్వభౌముడిగా ప్రఖ్యాతిగాంచిన కైకాల.. ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని కొనసాగించారు.. 777 చిత్రాల్లో నటించి మెప్పించారు.. కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా.. ఆయన నటించిన చివరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి.. కైకాల మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసినికి వెళ్లి నివాళులర్పిస్తున్నారు..