MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.. జూన్ 2న కవిత కొత్త పార్టీ..?
- మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..
- కవిత ఎపిసోడ్ ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చిన బీజేపీ ఎంపీ..
- జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టవచ్చు: ఎంపీ రఘునందన్ రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Raghunandan Rao: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఎపిసోడ్ ని ఫ్యామిలీ డ్రామాతో పోల్చారు. తెలంగాణలో దేవుళ్ళు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయా అన్న విషయంపై చర్చ జరుగుతుంది.. దేవుడి పక్కన దెయ్యం ఉంటే 12 ఏళ్లుగా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని వాళ్లే నాటకం ఆడుతున్నారు.. ఒకరితో గొడవ పడితే మరొకరి దగ్గరికి పోయేలా గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు.. మాట్లాడుకోవాలంటే తండ్రి, కూతురి మధ్య మధ్యవర్తి ఎందుకు వస్తారు అని అడిగారు. నా రాజకీయ పరిజ్ఞానం ప్రకారం కవిత సొంత పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యింది.. జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ పెట్టవచ్చు.. తర్వాత పాదయాత్ర చేయొచ్చు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.
Read Also: CSMIA: ముంబై ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. వ్యక్తి అరెస్ట్
Also Read
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
అయితే, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇంతకు ముందు కూడా కామెంట్ చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్తుందని.. వైఎస్ షర్మిళ తరహాలోనే కవిత కూడా పార్టీ నుంచి బయటకు వస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. ఈ సారి ఏకంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే కవిత పార్టీ పెడుతుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏదైనా స్పష్టమైన సమాచారంతో ఆ కామెంట్స్ చేశారా లేక రాజకీయ విమర్శల్లోనే భాగమా అనేది రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కవిత తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది.
- Tags
- bjp
- BRS
- congress
- harish rao
- kcr
తాజావార్తలు
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!