Rasamayi Balakishan : కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్‌లో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ ఏది అంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ జెండానే చూపిస్తారన్నారు. దేవుడులాంటి కేసీఆర్‌ను దూరం చేసుకొని దయ్యం లాంటి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నమని ప్రజలంతా బాధపడుతున్నారని, అర గ్యారెంటీ అమలు చేసి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయని…
కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ళు నిధులు నియామకాలు అనే గొప్ప ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి కేసీఅర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం గత కేసీఅర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రైతుబందు వేస్తానంటే ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి, బై బై కేసీఆర్ నినాదంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది..…
నటి విమలా రామన్ 'రుద్రంగి' చిత్రంతో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న మీరాబాయి పాత్ర ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దీనిని నిర్మిస్తున్నారు.
రీంనగర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు నిరసన సెగ ఎదురైంది. గన్నేరువరం మండలంలో పర్యటిస్తున్న రసయిని యువకులు అడ్డుకున్నారు. నియోజక వర్గ అభివృద్ధిపై యువకులు ప్రశ్నించారు. గుండపల్లి నుంచి గన్నేరువరం వరకు రోడ్డు అధ్వాన్నంగా ఉంటే పట్టించుకోవడం లేదని నిలదీశారు.
మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గాడిద పార్టీగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏం మాట్లాడతారో, ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియాలని రసమయి అన్నారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడతారని.. అది ఇక్కడున్న వాళ్లకు అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు తెలంగాణలో సిరిసిల్ల ప్రాంతానికి వచ్చి వెళ్తామో లేదో తెలియని ప్రాంతంగా ఉండేదని.. ఎన్నో ఏళ్లు…
రాజన్న సిరిసిల్ల జిల్లా… పోడు భూముల పై అవగాహన సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు రమేష్ బాబు,రసమయి బాల కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అడ వుల ను ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిరి సిల్ల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. జిల్లాలో 4 లక్ష72 వేల 329 ఎకరాలు భూమి ఉందన్నారు. దీన్లో 96.394 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. 2005-06 కేంద్రం ఆర్ ఓ.ఎఫ్ ఆర్ చట్టాన్ని తీసుకు…
కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఘాటు వాఖ్యలు చేసారు. బండి సంజయ్ ది విహారాయత్రనో ఏం యాత్రనో తెలువది అని చూపిన ఆయన దానికి అభివృద్ధి యాత్ర అని పెట్టుకుంటే బాగుంటుంది అని సూచించారు. యాత్ర పేరుతో తిరుగుతున్న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మానకొండూర్ కు ఎన్ని నిధులు ఇచ్చాడో నియోజకవర్గ ప్రజలకు స్పష్టం చేయాలి అన్నారు. ఇక నేను ఎమ్మెల్యే గా…
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా మరోసారి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కే అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో తన పాటతో ఉద్యమాన్ని రగిలించిన ప్రజా వాగ్గేయకారుడు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయికి సమున్నత గౌరవం కలిపించింది ప్రభుత్వం.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. దానికి ఛైర్మన్‌గా రసమయిని నియమించారు.. అయితే, ఆయన పదవి కాలం ముగిసిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఖాళీగా…
ఆయన వేదిక ఎక్కితే పాట పాడకుండా ఉండలేరు. అప్పటికప్పుడు పదాలతో పాట కట్టేస్తారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య పాడిన ఒకేఒక పాటతో సైలెంట్ అయిపోయారు. అదే ఆయన చివరి పాట. మీటింగ్‌కు వస్తే పాటల్లేవ్.. మాటల్లేవ్. ఎవరా వ్యక్తి? పాటల్లేవు.. పొడి పొడి మాటలే! తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో గుర్తింపు తెచ్చుకుని.. ఎమ్మెల్యే అయిన వ్యక్తి రసమయి బాలకిషన్. ఎమ్మెల్యే అయినా పాటను మర్చిపోలేదు. సభలు, సమావేశాల్లో రసమయి ఉంటే పాట కూడా ఉంటుంది.…