ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదం అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈటల హిట్లర్ వారసుల వద్ద చేరి నియంతృత్వముపై పోరాడతా అంటున్నారు. ఆయన ముందే ప్రిపేర్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈటల ఇంతకాలం చెప్పిన మాటలకు…చేతలకు పొంతన లేదు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం తీసుకువచ్చింది. ఇవి నల్ల చట్టాలు… రైతులను నడ్డివిరిచే చట్టాలు అని ఈటల అన్నారు. కానీ ఇప్పుడు ఆయన బీజేపీలో చేరి ప్రజలకు ఏ న్యాయం చేస్తారో చెప్పాలి. ఈటల మునిగిపోయే పడవ ఎక్కుతున్నారు. దేశం అంత బీజేపీని విలన్ గా చూస్తోంది. మోడీ ప్రభుత్వం బడుగు,బలహీన వర్గాల కోసం ఒక్క కొత్త పథకం అయిన తీసుకువచ్చిందా అని అడిగారు.. బీజేపీలో చేరడం ద్వారా తెలంగాణ ,హుజురాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేశారు అని పేర్కొన్నారు.