Mohammad Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కి శాఖలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహమ్మద్ అజహరుద్దీన్ గత నెల 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు.
Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నారని చెప్పారు.. ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని.. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి కాంట్రాక్టు లబ్ధి కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పరితపించే అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. Also Read : Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కార్మికులకు…
Minister Seethakka: తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క నేడు నాంపల్లి స్పెషల్ కోర్టు ఎదుట హాజరయ్యారు. గత విచారణలో హాజరుకాలేకపోవడంతో కోర్టు NBW (Non-Bailable Warrant) జారీ చేసింది. దీనితో మంత్రి సీతక్క ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రెండు షూరీటీలు ఒక్కొక్కటి రూ.10,000 చొప్పున సమర్పించారు. దీంతో కోర్టు NBWను రీకాల్ చేసింది. 2021లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విస్తరించిన సమయంలో పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక తీవ్ర…
Duddilla Sridhar Babu : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎదుర్కొన్న కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కొట్టేసింది. ఈ కేసు 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదు అయింది. కోర్టు తాజా తీర్పుతో న్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “2017లో BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల భూములు బలవంతంగా లాక్కొంటుందని నిరసనగా పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లాం. అప్పట్లో మేము 12మందిపై అక్రమంగా నాన్-బెయిలబుల్…
Bhatti Vikramarka : ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిని వర్చువల్‌గా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖా మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, ఈ ఘట్టం సింగరేణి కంపెనీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక గని ప్రారంభం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, గర్వానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఒడిశాలో గని ప్రారంభించటం ద్వారా సింగరేణి…
Ponguleti Srinivas Reddy : పద్మశ్రీ గ్రహీత, పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో మాట్లాడుతూ మంత్రి ఆయన మృతిని “చాలా దురదృష్టకరమైనది, బాధాకరమైనది” అన్నారు. “పద్మశ్రీ వనజీవి రామయ్య మనకు కనిపించనంతగా దూరమయ్యారు. ఇది మనం తట్టుకోలేని నష్టం,” అని మంత్రి అన్నారు. ప్రభుత్వ…
కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి కేంద్రమంత్రులతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు."రెండు నెలలలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు.
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలకు ఘోర ప్రమాదం జరిగింది. నేడు మంత్రి హుజూర్‌నగర్ నుండి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 15 కార్ల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. Also Read: Kaushik Reddy: గ్రామసభలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి నల్గొండ జిల్లా గరిడేపల్లి వద్ద ఉత్తమ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెంట వెలుతున్న కాంగ్రెస్ నేతల వాహనాలు…