హుస్నాబాద్‌ను మూడు ముక్కలు చేశామంటున్నారు.. కానీ, హుస్నాబాద్ మూడు దిక్కుల అభివృద్ధి చెందుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్‌కు మద్దతుగా హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం కొహెడ జరిగిన బీఆర్‌ఎస్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ మేరకు హరీష్ రావు మాట్లాడుతూ.. వంద అబద్ధాలు అడైనా కాంగ్రెస్ అధికారంలోని రావాలని చూస్తోందని, గతి, సుతి లేని కాంగ్రెస్ నున్నమితే అగం అవుతామన్నారు. కర్ణాటకలో కాంగ్రెసొల్లు 5 గ్యారంటీలు అన్నారు, ఇప్పుడు అక్కడ ప్రజలు అగైయిపోయినం అంటున్నారు.. మనం అగం కావద్దు అని పేర్కొన్నారు.
Also Read: Bhatti Vikramarka: బీఆర్ఎస్ నేతలు పిచ్చి పిచ్చి వేషాలేయడం మానేయండి..
కరోనా వచ్చినప్పుడు ప్రజలతో ఉందని బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను నమ్మితే.. కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్టే అన్నారు. ఆరు గ్యారెంటీలు ఏమో కానీ, ఆరు నెలలకు ఒక్కరూ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బీఆర్‌ఎస్ మేనిఫెస్టో వందరెట్లు నయం అన్నారు. 3 గంటల కరెంటు ఇస్తే 3 ఎకరాలు పరుతుందని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. ఆయనకు హార్స్ పవర్ అంటే అర్థం తెలువదు కానీ పీసీసీ అధ్యక్ష పదవి మీద కూర్చున్నాడు అని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ కంటే విరామం లేకుండ కరెంట్ ఇచ్చిన కేసీఆర్ రికాం లేకుండ గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా సతీష్‌ను మంచి మేజార్టీలో గెలిపించాలన్నారు.
Also Read: Telangana Elections 2023: కేసీఆర్‌కు బిగ్ షాక్.. తెలంగాణలో డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కే!