Bhatti Vikramarka Fire On BRS: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని బాణాపురంతో పాటు ముదిగొండ మండలం గంధసిరిలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా భట్టి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్.. కరెంట్ వెలుగులు తెచ్చిందే కాంగ్రెస్.. కాంగ్రెస్ కరెంట్ తెస్తే.. కాంగ్రెస్ కావాలా..? కరెంట్ కావాలా..? అని కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కావాలి.. కరెంట్ కావాలి.. పేదలకు సంపద పంచుతాం.. ఆరు గ్యారెంటీలతో కూడిన కార్డులను ఇస్తున్నాం.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలను.. మేనిఫెస్టోను అమలు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు.
Read Also: Cucumber Health Benefits : చలికాలంలో కీర దోసను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..
ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే రూ. లక్ష పెళ్లి కానుకతో పాటు.. తులం బంగారం ఇస్తామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతుంది.. బీఆర్ఎస్ నేతలు పిచ్చి పిచ్చి వేషాలేయడం మానేయండి అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడదు.. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ కలిసి గ్యాస్ సిలిండర్ ధర అత్యధికంగా పెంచారు.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 78 స్థానాలు గెలవబోతుంది.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలను అందలమెక్కించాయని భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రూ. 2 లక్షలు కళ్యాణ లక్ష్మీ ఇస్తే అందులో సగం కట్ చేసి లక్ష రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమే రాకుంటే పేద ప్రజలు తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి కూడా లేదు అని భట్టి విక్రమార్క అన్నారు.