KTR vs Bandi Sanjay : బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా
- బండి సంజయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అవాస్తవమని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ నేత
- డిసెంబర్ 15న సిటీ సివిల్ కోర్టులో విచారణకు వెళ్లనున్న కేసు
- హోదాను దుర్వినియోగం చేస్తూ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారన్న కేటీఆర్ ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR vs Bandi Sanjay : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనానికి తావిచ్చే పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ పరువు నష్టం దావా వేశారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఆరోపణలతో నిండివున్నాయని, అవి తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
సోమవారం కేటీఆర్ తరఫు న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు డిసెంబర్ 15వ తేదీన విచారణ జరపనుంది. బండి సంజయ్ తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. అయినప్పటికీ బండి సంజయ్ తనపై రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు కొనసాగిస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
Also Read
- Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
- TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆల్‌టైమ్ రికార్డు..!
వింటేజ్ లుక్లో కొత్త Royal Enfield Meteor 350 లాంచ్.. ఫీచర్లు, ధరలు ఇలా!
తనపై చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయని, ముఖ్యంగా తన ప్రజా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ కోర్టులో స్పష్టం చేశారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపణ. రాజకీయంగా పోటీ చేయడం వేరే విషయం, కానీ తప్పుడు ఆరోపణలతో ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం అసహ్యకరమని కేటీఆర్ వైఖరి.
బండి సంజయ్‌పై కేటీఆర్ వేసిన ఈ భారీ దావా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు–ప్రతియారోపణలు మరోస్థాయికి చేరాయి. ఈ కేసు విచారణ ఎటువంటి మలుపు తిరుగుతుందన్నది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
వాహనాలు, మొబైల్, మరేదైనా వస్తువు పోయిందా? ఇట్టే కనిపెట్టొచ్చు.. కొత్త JioFind Series లాంచ్!
తాజావార్తలు
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
-
Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
టెస్లా లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!