Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Item Songs: సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపుతుంటారు. అయితే కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం ఎన్ని ఆఫర్లు వచ్చినా స్పెషల్ సాంగ్స్ చేయడానికి దూరంగానే ఉంటారు. కానీ తమకు అత్యంత సన్నిహితమైన హీరోలు, ప్రత్యేక అనుబంధం ఉన్న నటుల కోసం మాత్రం ఐటమ్ సాంగ్స్‌కు అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి లీస్ట్‌లో నటి కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ 2013లో మలయాళ చిత్రం గీతాంజలితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 13 ఏళ్ల కెరీర్లో గ్లామర్ పాత్రలకు కూడా దూరంగా ఉన్న ఆమె ఇప్పటివరకు ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయలేదు. అయితే తాజాగా నాని హీరోగా తెరకెక్కుతున్న ది పారడైస్ సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఈ పాటను సుమారు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నానితో ఉన్న స్నేహం కారణంగానే కీర్తి ఈ స్పెషల్ సాంగ్‌కు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. గతంలో నాని-కీర్తి కాంబినేషన్లో వచ్చిన నేను లోకల్, దసరా చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో, ఈ జోడీపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఒక సినిమా, విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్‌లో నటిస్తుండగా, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ది పారడైస్ కోసం స్పెషల్ సాంగ్‌కి డేట్లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇక త్రిష కూడా తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నడూ ఐటమ్ సాంగ్ చేయలేదు. అయితే తమిళ స్టార్ విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరిన్ని స్పెషల్ సాంగ్ ఆఫర్లు వచ్చినప్పటికీ ఆమె తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా సాధారణంగా ఐటమ్ సాంగ్స్‌కి దూరంగానే ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం కారణంగా జనతా గ్యారేజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం వచ్చిన ఇతర ఐటమ్ సాంగ్ అవకాశాలను కూడా ఆమె తిరస్కరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగింది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..