Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటి పరిసరాలు, వంటిల్లు, బాత్రూమ్లను శుభ్రం చేసి చెత్తను బయట పడేసే పనులను మనకు బదులుగా ఒక హ్యూమనాయిడ్ రోబోట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో దృశ్యంలా అనిపించినప్పటికీ, అమెరికాలో ఈ సేవలు నిజంగానే అందుబాటులోకి వచ్చాయి. ‘టావ్ రోబోటిక్స్’ అనే అమెరికన్ స్టార్టప్ హ్యూమనాయిడ్ రోబోల ద్వారా గృహ శుభ్రత సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ సీఈఓ అలెగ్జాండర్ కోచ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో నగరం ఆధారంగా ప్రారంభమైన ఈ సేవలు ప్రస్తుతం గంటకు 30 డాలర్ల (సుమారు రూ. 3,000) ధరకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సర్వీస్ ప్రస్తుతం అందరికీ కాకుండా కేవలం ఆహ్వానం (ఇన్వైట్) ఆధారంగా మాత్రమే పొందే వెసులుబాటు ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నల్లటి యూనిఫాం ధరించిన హ్యూమనాయిడ్ రోబోట్ వ్యాన్ నుండి దిగి, శుభ్రపరిచే సామాగ్రితో పని చేయడానికి వెళ్లడం కనిపిస్తుంది. ఈ రోబోట్ ముఖంపై రెండు కెమెరాలు కళ్లలా అమర్చబడి ఉన్నాయి. ఇవి వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించడం, చెత్తను బయటకు తీసుకెళ్లడం వంటి పనులను సమర్థవంతంగా చేయగలవు. ఈ సేవ కోసం కంపెనీ మూడు వేర్వేరు రోబోలను పరిచయం చేసింది. చెల్సీ అనే రోబోట్‌ను కిచెన్, బాత్రూమ్లు, టైల్స్, సింక్, అద్దాలను శుభ్రం చేయడానికి రూపొందించారు. ఎలాన్ అనే రోబోట్ ఇంట్లోని రోజువారీ సర్దుబాటు పనులను చూసుకుంటుంది. ఇది కొన్ని సార్లు ఇంటిని పరిశీలించిన తర్వాత వస్తువులు ఎక్కడ ఉండాలో గుర్తించి, వాటిని సరైన స్థానంలో ఉంచుతుంది. మూడో రోబోట్ టోనీని మూలలు, కిటికీల ట్రాక్స్ వంటి కష్టతరమైన ప్రదేశాలలో డీప్ క్లీనింగ్ కోసం తయారు చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అయితే, ఈ రోబోట్లు పూర్తిగా స్వయంప్రతిపత్తితో పనిచేయవు. వీటిని కృత్రిమ మేధస్సు (AI) , వెనుక నుండి ఒక మానవ ఆపరేటర్ కలసి నియంత్రిస్తారు. దీనివల్ల ప్రైవసీ, భద్రతకు సంబంధించి కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, ఎందుకంటే ఇంట్లో పనిచేసే రోబోట్ వ్యక్తిగత వివరాలను చూసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ, శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన ఈ మోడల్ విజయవంతమైతే, భవిష్యత్తులో గృహ సంబంధిత రోబోటిక్ సేవల మార్కెట్ ఊహించని రీతిలో విస్తరించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!