Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్, జైళ్ల శాఖలలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి 4 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 7,437 ఖాళీలను భర్తీ చేయనున్నారు. శాఖల వారీగా వివరాలు చూస్తే.. పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్) 148, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (AR) 14, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (TGSP) 12, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (SARCPL) 3, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (FPB) 23 పోస్టులు ఉన్నాయి.
అలాగే పోలీస్ కానిస్టేబుల్ విభాగానికి వస్తే సివిల్ 3,697, AR 1,052, SARCPL 24, డ్రైవర్ PTO 20, మెకానిక్ PTO 7 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) పరిధిలో 44 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు, 1,380 కానిస్టేబుల్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగానికి సంబంధించి 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 751 ఫైర్ ఫైటర్ ఖాళీలు ఉన్నాయి. అలాగే జైళ్ల శాఖలో 14 డిప్యూటీ జైలర్ (పురుషులు), 1 డిప్యూటీ జైలర్ (మహిళలు), 196 వార్డర్ (పురుషులు), 12 వార్డర్ (మహిళలు) ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
Also Read
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
అర్హత ఉన్న అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందే నోటిఫికేషన్లో పేర్కొన్న దేహదారుఢ్య, వైద్య ప్రమాణాలకు తాము తగినట్లుగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి సివిల్ సర్జన్‌తో పరీక్షించుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
ఆన్లైన్ అప్లికేషన్ దాఖలు చేయడానికి తెలంగాణ స్థానికతకు సంబంధించిన బోనాఫైడ్ (1 నుంచి 7వ తరగతి) లేదా నివాస ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. అలాగే ఏప్రిల్ 1, 2026 తర్వాత జారీ చేసిన బీసీ కేటగిరీ అభ్యర్థుల నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికేట్, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు తమ ఉపకుల వర్గీకరణ స్పష్టంగా ఉండేలా కుల ధృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి..
కనీస వయస్సు: 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు: 22 సంవత్సరాలు దాటకూడదు. 1 జూలై 2026 నాటికి లెక్కించబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం జీవో (GO Ms No. 87, తేదీ: 18-05-2026) ప్రకారం పోలీసు, ఫైర్, జైళ్లు, SPF వర్గాల యూనిఫాం ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని మరో 5 సంవత్సరాలు పెంచింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాల వరకూ పెరిగినట్లు అవుతుంది. దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే వీరు 32 సంవత్సరాల వయస్సు దాటని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సబ్ ఇన్ స్పెక్టర్ (SI) ఉద్యోగాల వయోపరిమితి..
కనీస వయస్సు: 21 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు దాటకూడదు. అభ్యర్థుల వయస్సు 1 జూలై 2026 నాటికి లెక్కించబడుతుంది. జీవో (GO Ms No. 87) ప్రకారం SI పోస్టులకు కూడా సాధారణ గరిష్ట వయోపరిమితిపై అదనంగా 5 సంవత్సరాల సడలింపు లభిస్తుంది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాల వరకూ వర్తిస్తుంది. దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే వీరు 35 సంవత్సరాల వయస్సు దాటని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!