JioFind Series: ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో (Jio) తాజాగా JioFind సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో JioFind, JioFind Pro అనే రెండు వైర్లెస్ GPS ట్రాకర్లను తీసుక వచ్చారు. ఇవి మీ విలువైన వస్తువులు, వాహనాలు, స్కూల్ బ్యాగులు, ఇతర మొబైల్ ఐటెమ్స్ ఇలా ఏదైనా రియల్ టైంలో ట్రాక్ చేయడానికి తాయారు చేయబడ్డాయి. ఈ ట్రాకర్లను వినియోగదారులు JioThings యాప్ ద్వారా ఎక్కడినుండైనా వారి వస్తువు సంబంధించిన ప్రస్తుత స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ కొత్త JioFind ట్రాకర్ భారతదేశంలోని అన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా హైవేస్, పల్లె మార్గాలు, రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా ట్రాకింగ్‌ను నిరంతరం అందిస్తుంది. జియో నంబర్ షేరింగ్ టెక్నాలజీ ద్వారా.. JioFind ఇప్పటికే ఉన్న జియో స్మార్ట్‌ఫోన్ సిమ్‌ను వాడుతుంది. అందువల్ల వేరే ప్లాన్ అవసరం లేదు. ఇక JioFindలో 1100mAh బ్యాటరీ ఉంటుంది. ఇది స్కూల్ బ్యాగులు, వాహనాలు వంటి వస్తువులకు సరిపోతుంది. JioFind Proలో పెద్ద 10000mAh బ్యాటరీ ఉంటుందని.. ఇది సుమారు 30 రోజులు నిరంతరం ట్రాకింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తరచుగా ఛార్జింగ్ అవసరం లేకుండా ట్రాకింగ్ పనితీరును అందిస్తుంది.
OPPO F31 Series లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇలా!
JioThings యాప్ ఫీచర్లు:
మూమెంట్ ట్రాకింగ్: JioFind లేదా JioFind Pro ట్రాకర్‌ను ఎక్కడైనా ఐటెమ్‌కు జతచేసి.. భారతదేశంలోని ఎక్కడైనా ఉన్న స్థితిని రియల్ టైంలో ట్రాక్ చేయొచ్చు.
వాయిస్ మానిటరింగ్: వినియోగదారుడు దూరంగా ఉండగానే ట్రాకర్ చుట్టూ ఉన్న వాయిస్‌ను వినగలుగుతారు. చిన్న ఆడియో క్లిప్‌లను రికార్డు చేసుకోవడం కూడా సాధ్యమవుతుంది.
జియోఫెన్సింగ్ అలెర్ట్స్: వినియోగదారు 5 వరకు సేఫ్టీ జోన్స్ లను సెట్ చేసుకొని.. ఆ ప్రాంతానికి చేరినపుడు లేదా అక్కడి నుండి వెళ్ళినప్పుడు నోటిఫికేషన్లు పొందొచ్చు.
ఈ JioFind Series లోని డివైస్‌లు జియో ఫోన్ నంబర్‌తో పని చేస్తాయి. వేరే డేటా ప్లాన్ అవసరం లేకుండా అదే జియో నంబర్ డేటా ప్లాన్‌ను పంచుకుంటాయి. ఒకే జియో నంబర్ ద్వారా ఒకేసారి 5 JioFind డివైస్‌లను JioThings యాప్ ద్వారా లింక్ చేయొచ్చు. JioFind Series డివైస్‌లు ప్రత్యేకంగా జియో సిమ్‌తో మాత్రమే పని చేస్తాయి.
ఇక స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఈ ట్రాకర్లు నలుపు (Black) రంగులో ఉంటాయి. JioFind మోడల్‌లో 1100mAh బ్యాటరీ ఉంటుంది. ఇది సుమారు 3 నుండి 4 రోజులు ఉపయోగపడుతుంది. ఇక JioFind Pro మోడల్‌లో పెద్ద 10000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 3 నుండి 4 వారాల పాటు ట్రాకింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఛార్జింగ్ కోసం Type A to C కేబుల్ అందించారు. కానీ, Type C to C ఛార్జింగ్ కేబుల్ మద్దతు లేదు.
JioFind Pro మోడల్ ప్రత్యేకంగా మ్యాగ్నెటిక్ మౌంట్ ఫీచర్‌ను కలిగి ఉంది. JioFind మోడల్ బరువు 41 గ్రాములు కాగా, JioFind Pro మోడల్ బరువు 297 గ్రాములుగా ఉంటుంది. ఈ ట్రాకర్లను నియంత్రించడానికి JioThings యాప్ అందుబాటులో ఉంటుంది. ప్రతి డివైస్‌కు 1 సంవత్సరం వారంటీ ఉంటుంది.