Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Protein Tips : శరీరంలో కండరాల బలానికి, కణజాలాల పునర్నిర్మాణానికి, హార్మోన్లు , ఎంజైమ్‌ల ఉత్పత్తికి, అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రొటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. బరువు నియంత్రణలో ఉంచుకోవడానికైనా, పొట్ట నిండిన అనుభూతిని పొందడానికైనా ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా శాకాహారులకు ప్రొటీన్ అనగానే మొదట గుర్తుకొచ్చేది పనీర్. ప్రతి 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 నుండి 21 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అంతేకాకుండా, శరీరానికి అవసరమైన 9 రకాల ఎసెన్షియల్ అమైనో ఆసిడ్లను అందించే పూర్తి స్థాయి ప్రొటీన్ మూలంగా పనీర్ నిలుస్తుంది. ఇందులో క్యాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది.
పచ్చి పనీర్ vs వండిన పనీర్.. దేనిలో ప్రొటీన్ ఎక్కువ?
పనీర్‌ను పచ్చిగా తిన్నా లేదా వండుకుని తిన్నా రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే వీటి మధ్య కొన్ని చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా తెలిపిన ప్రకారం పనీర్‌ను వండినప్పుడు అందులోని నీటి శాతం తగ్గిపోవడం వల్ల పనీర్ చిక్కబడి, తూకం ప్రకారం చూస్తే వండిన పనీర్‌లో ప్రొటీన్ సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో, వండే ప్రక్రియలో నూనె లేదా నెయ్యి జోడించడం వల్ల క్యాలరీలు పెరుగుతాయి కాబట్టి క్యాలరీల ప్రాతిపదికన చూస్తే పచ్చి పనీర్లోనే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. అయితే న్యూట్రిషన్ నిపుణురాలు ప్రాచీ జైన్ ప్రకారం పనీర్‌ను లైట్‌గా వేయించడం, స్టీమ్ చేయడం లేదా గ్రిల్ చేయడం వల్ల అందులోని ప్రొటీన్ పరిమాణంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఎక్కువ సేపు డీప్ ఫ్రై చేయడం లేదా అధిక ఉష్ణోగ్రత వద్ద వండటం వల్ల ప్రొటీన్ మారకపోయినా, కొవ్వు , క్యాలరీలు గణనీయంగా పెరుగుతాయి.
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
వండే పద్ధతి ప్రాముఖ్యత , జీర్ణక్రియ
పనీర్‌ను కాస్త వేడి చేసి వండటం వల్ల అది శరీరానికి సులభంగా జీర్ణమవుతుంది. అయితే ఓవర్ కుక్ చేయడం వల్ల అందులోని కొన్ని పోషకాలు నశించే అవకాశం ఉంది. అందుకే డీప్ ఫ్రై చేయడానికి బదులుగా నాన్-స్టిక్ పాన్‌పై తక్కువ నూనెతో లైట్‌గా వేయించడం లేదా కర్రీలలో వేయడం వల్ల రుచితో పాటు పోషక విలువలు దెబ్బతినకుండా ఉంటాయి. పచ్చి పనీర్‌ను మెత్తగా చేయడానికి మైక్రోవేవ్‌లో కేవలం 20 నుండి 30 సెకన్లు వేడి చేస్తే సరిపోతుంది. కర్రీలలో పనీర్ వేసేటప్పుడు స్టవ్ ఆపే ముందు ముక్కలను కూరలో వేస్తే అవి మెత్తగా ఉండటంతో పాటు పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.
ప్రొటీన్ దెబ్బతినకుండా పనీర్ వాడే విధానం
పనీర్ నుంచి పూర్తి స్థాయి పోషకాలు పొందడానికి కేవలం పనీర్పైనే ఆధారపడకుండా దానికి ధాన్యాలు, బ్రౌన్ రైస్, పప్పు ధాన్యాలు , కూరగాయలను తోడుగా తీసుకోవడం వల్ల శరీరానికి సమతుల్య ఆహారం లభిస్తుంది. పనీర్‌ను రోజువారీ ఆహారంలో సలాడ్లు, రోల్స్, శాండ్విచ్లు లేదా స్నాక్‌గా పండ్లు , నట్స్‌తో కలిపి తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు లేదా క్యాలరీలు తగ్గించుకోవాలనుకునే వారు తక్కువ కొవ్వు ఉండే లో-ఫ్యాట్ పనీర్‌ను ఎంచుకోవడం మంచిది. సాధారణంగా ఒక పూట భోజనంలో 20 గ్రాముల ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
పచ్చి, వండిన పనీర్‌లో ప్రొటీన్ తేడా ఏమిటి?#
ఏ విధంగా వండితే పోషకాలు ఎక్కువగా ఉంటాయి?#
డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుంది?#
ఆరోగ్యంగా పనీర్ తినేందుకు నిపుణుల సూచనలు
తాజావార్తలు
-
Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
-
CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
-
Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
OnePlus Ace 7 Pro: 9000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ Ace 7 Pro.. 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5 చిప్సెట్?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!