Royal Enfield Meteor 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త మీటియర్ 350 (Meteor 350) మోటార్ సైకిల్‌లు భారత్ లో లాంచ్ అయ్యాయి. 2020లో తొలిసారిగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ 350cc క్రూయిజర్ బైక్‌కు ఇది మొదటి అప్డేట్. ఈ కొత్త మోడల్‌లో అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు, కొత్త ఫీచర్లను తీసుకవచ్చారు. మరి ఆ వివరాలేంటో పూర్తిగా చూసేద్దామా..
ఫీచర్లు:
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 బైక్‌లో LED హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ పాడ్, LED టర్న్ ఇండికేటర్స్, USB టైప్- C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, అసిస్ట్-అండ్-స్లిప్ క్లచ్, అడ్జస్టబుల్ లీవర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫైర్‌బాల్, స్టెల్లార్ వేరియంట్లలో LED హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ పాడ్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. అయితే, సూపర్ నోవా, అరోరా వేరియంట్లలో అడ్జస్టబుల్ లీవర్స్ స్టాండర్డ్‌గా అందించబడ్డాయి. ఈ బైక్ 349cc ఎయిర్-కూల్డ్ J-సిరీస్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 6100 RPM వద్ద గరిష్ఠంగా 20.2 Bhp పవర్‌ను, 4000 RPM వద్ద 27nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Maremma : రవితేజ ఇంటి నుంచి మరో హీరో.. గ్లింప్స్ చూశారా..
ఈ కొత్త మీటియర్ 350 బైక్లు ఇప్పుడు అన్ని వేరియంట్లలో కొత్త రంగులతో వచ్చాయి. టాప్ ఎండ్ వేరియంట్ అయిన సూపర్నోవా మోడల్ క్రోమ్ ఫినిష్‌లతో కొత్త రంగులను కలిగి ఉంది. ఇక, అరోరా వేరియంట్ హెరిటేజ్‌ను ప్రతిబింబించే రంగులలో లభిస్తుంది. స్టెల్లార్ వేరియంట్‌లో బోల్డ్ రంగులు ఉన్నాయి. అయితే, ఫైర్‌బాల్ వేరియంట్ యువ రైడర్లను ఆకర్షించడానికి ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంది.
Vidadala Rajini: చరిత్ర చెరిపేస్తే చెరగదు.. మెడికల్ కాలేజీల ఘనత జగన్‌దే..!

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియర్ 350 మోటార్ సైకిల్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ. 1,95,762గా ఉంది. ఈ మోడల్ వివిధ వేరియంట్లలో లభిస్తుంది. ఫైర్‌బాల్ వేరియంట్ (ఫైర్‌బాల్ ఆరెంజ్ & ఫైర్‌బాల్ గ్రే) ధర రూ. 1,95,762 కాగా.. స్టెల్లార్ వేరియంట్ (స్టెల్లార్ మ్యాట్ గ్రే & స్టెల్లార్ మెరైన్ బ్లూ) రూ. 2,03,419కి లభిస్తుంది. అదే అరోరా వేరియంట్ (అరోరా రెట్రో గ్రీన్ & అరోరా రెడ్) ధర రూ. 2,06,290. ఇక టాప్-ఎండ్ మోడల్ అయిన సూపర్నోవా వేరియంట్ (సూపర్నోవా బ్లాక్) ధర రూ. 2,15,883గా నిర్ణయించారు.
All new-colours. All-new features. The 2025 Meteor 350 brings back unhurried journeys and undemanding motorcycling. No pointless baggage. No unusable horsepower. Just perfect geometry, ample torque, and a whole lot of horizon.
Watch the film here – https://t.co/ctjGTSpga3 pic.twitter.com/c86Xc0LU93
— Royal Enfield (@royalenfield) September 15, 2025