7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus N6x: వన్‌ప్లస్ (OnePlus) తన N-సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ OnePlus N6xను భారత మార్కెట్లో జూలై 31న విడుదల చేయనుంది. ఇటీవల లాంచ్ అయిన OnePlus N6 తర్వాత వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని లాంచ్ కాబోతుంది. లాంచ్‌కు ముందే కంపెనీ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లను అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ అమ్మకాలు ఆగస్టు 4 నుంచి అమెజాన్ ఇండియాలో మొదలు కానున్నాయి.
భారీ బ్యాటరీ:
OnePlus N6xలో 7,000mAh బ్యాటరీను అందిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది OnePlus N6లో ఉన్న 8,000mAh బ్యాటరీ కంటే కొద్దిగా తక్కువ అయినప్పటికీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2.5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే 20.56 గంటల వీడియో ప్లేబ్యాక్, 133.56 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 25.04 గంటల సోషల్ మీడియా వినియోగం, 11.26 గంటల నిరంతర వీడియో రికార్డింగ్ చేయవచ్చని తెలిపింది.
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
కొత్త డిజైన్:
డిజైన్ పరంగా కూడా OnePlus N6xలో కాస్త మార్పులు చేశారు. గత మోడల్లోని చతురస్రాకార కెమెరా మాడ్యూల్ స్థానంలో ఈసారి ఎడమవైపు పైభాగంలో నిలువుగా ఉండే పిల్-షేప్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. LED ఫ్లాష్‌ను కెమెరా మాడ్యూల్‌కు వేరుగా అమర్చారు. ఫ్లాట్ ఫ్రేమ్, ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌తో ఫోన్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ ఐస్ బ్లూ, బర్గండీ రెడ్ రంగుల్లో అందుబాటులోకి రానుంది.
120Hz డిస్ప్లే:
OnePlus N6xలో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అయితే డిస్ప్లే పరిమాణం, ప్రాసెసర్, కెమెరా వివరాలు, RAM, స్టోరేజ్ వేరియంట్లు, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం, ఆపరేటింగ్ సిస్టమ్ వంటి పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా ప్రకటించలేదు. స్మార్ట్ ఫోన్ జూలై 31న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుండగా.. ఆగస్టు 4 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!