Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.!
- రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల సూచన
- ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- జగిత్యాలలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం
- జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వర్షాకాలం ఊపందుకుంది. రాష్ట్రాన్ని ముసురు ఆవహించడంతో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా మారే సూచనలు కనిపించడంతో ఆయా ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
ఉత్తర తెలంగాణలో అతిభారీ వర్షాలు – జగిత్యాలలో అత్యధికం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా నమోదవుతుండగా, అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 19 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు, స్థానిక అధికారులను వాతావరణ కేంద్రం ముందస్తుగా అప్రమత్తం చేసింది. వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
Also Read
జూరాలకు ప్రవాహం.. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టులు నిండుకుండలా
ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జూరాల వద్ద పరిస్థితి చూస్తే.. ఇన్‌ఫ్లో 21,000 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 32,806 క్యూసెక్కులుగా ఉంది. వరద తాకిడి స్థిరంగా ఉండటంతో భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు అధికారులు నీటి విడుదల ప్రారంభించారు. దీనితో పాటు కుడి, ఎడమ కాలువలకు కూడా సాగు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలకు వర్ష సూచన ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని యంత్రాంగం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..