Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించడమే ఆమె పాలిట శాపమైంది.. తను ప్రేమించిన వ్యక్తి.. పెళ్లికి నో చెప్పడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. మనస్థాపంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. విషాదకరమైన ఈ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగింది. ఐతే సహచర ఉద్యోగికి వీడియో కాల్ చేసి మరీ బలవన్మరణం చెందడం కలకలం రేపింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో తండి పీతాంబర్ కుటుంబతో సహా నివాసం ఉంటున్నాడు. నిజానికి అతడి స్వస్థలం ఒడిశా. పీతాంబర్ ఒడిశాకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి. రిటైర్మెంట్ అనంతరం గొల్లప్రోలుకు వచ్చి స్థిరపడ్డారు. అతడి కుమార్తె తండి ఫిస్కిల్లా కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉన్న రిలయన్స్ డిజిటల్లో బజాజ్ ఫైనాన్స్ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.
తల్లిదండ్రులు ఒడిశాలో తమ బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫిస్కిల్లా .. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకునే సమయంలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సహచర ఉద్యోగి, కాకినాడ సమీప మాధవపట్నానికి చెందిన నరేంద్రకుమార్‌కు ఫోన్ చేసి చెప్పింది. సమయంలో ఆమె మెడకు చున్నీ తగిలించుకుని రోదిస్తూ మాట్లాడినట్లు తెలుస్తోంది. కంగారు పడిన అతడు వెంటనే పిఠాపురం జగ్గయ్యచెరువులో నివాసముంటున్న చినబాబుకు ఫోన్ చేసి చెప్పాడు. అతడు అక్కడకు వెళ్లే సరికి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది ఫిస్కిల్లా. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్లి ఆమెను కిందకు దింపాడు చినబాబు. బతుకుందేమోనని సీపీఆర్ చేశాడు. అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
మరోవైపు ఫిస్కిల్లా రెండేళ్లుగా తనతో పాటు పని చేసే ఉద్యోగితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల అతడు వేరేచోటుకు బదిలీపై వెళ్లాడు. అనంతరం ఆ యువకుడికి పెళ్లి కుదిరినట్టు తెలిసింది. ఈ విషయంలో వారి మధ్య వివాదం జరిగినట్టు బంధువులు చెబుతున్నారు. ఫిస్కిల్లా చనిపోయే సమయంలో అతడికే సెల్ఫీ వీడియో కాల్ చేసి ఉరివేసుకున్నట్లు సమాచారం. ప్రేమికుడు ఎవరన్నదీ పోలీసులు గోప్యంగా ఉంచారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!