KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధాటిగా విరుచుకుపడ్డారు. “ప్రజాపాలనలో ప్రజలు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు మేలు చేసేలా లేదు, ముడుపుల పాలనగా మారింది” అంటూ ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగితే రద్దు చేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. “మా హయాంలో పేపర్ లీక్ అయితే వెంటనే పరీక్ష రద్దు చేసాం. ఇప్పుడు అవినీతి వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఎవరిది నియంత పాలన?” అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక కాలేజీలు మూతపడ్డాయని, ఆరోగ్యశ్రీ డబ్బులు రాక హాస్పిటల్ సేవలు ఆగిపోయాయని, యూరియా కొరతతో వ్యవసాయం దెబ్బతింటోందని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి పాలనలో కుటుంబరాజకీయాలు లేవని చెప్పుకుంటే, ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డికి రెండు కాంట్రాక్టులు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే సీఎం బంధువులు కల్వకుర్తి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి, ఆ భూములకు లాభం కలిగేలా ఆర్.ఆర్.ఆర్. అలైన్‌మెంట్ మార్చారని ఆరోపించారు. “జైపాల్ రెడ్డి బంధువులకూ లాభం చేకూర్చడానికే ఈ మార్పులు జరిగాయి” అని వ్యాఖ్యానించారు.
7,000mAh బ్యాటరీ, 6.72 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో అమ్మకాల సునామి సృష్టించడానికి సిద్దమైన Moto G36!
ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్టును కేటీఆర్ “అతిపెద్ద స్కామ్”గా పిలుస్తూ, త్వరలోనే సర్వే నంబర్లతో సహా బయటపెడతామని చెప్పారు. “ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అన్నీ గాలిలో మేడలు. సిటీ లేదు, భవిష్యత్తు లేదు – కేవలం డ్రామా మాత్రమే” అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టి తప్పుకోవడానికి సీఎం బెదిరింపులే కారణమని కేటీఆర్ ఆరోపించారు. “సీఎఫ్‌ఓను జైలుకు పంపుతా అని బెదిరించారు. ముడుపులు అడిగినందుకే ఎల్‌అండ్‌టి వెళ్లిపోతోంది” అన్నారు. అదే సమయంలో ఎమ్మార్ కంపెనీలో 26 శాతం వాటాను ప్రభుత్వం అమ్మాలని చూస్తోందని, మూసీ ప్రాజెక్టును కూడా వారికి అప్పగించాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
పొంగులేటి ఇంటిపై రైడ్ జరిగినా ఒక సంవత్సరం గడిచినా పంచనామా బయట పెట్టలేదని కేటీఆర్ ఆరోపించారు. “నోట్ల కట్టలు లెక్కబెట్టే యంత్రాలు ఎందుకు వెళ్లాయి? ఏమీ దొరకలేదని ధ్రువీకరించండి” అంటూ సవాల్ విసిరారు. అలాగే, మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌లోనే డ్రగ్స్ పట్టుకున్నారని, రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణలో వైఫల్యం బహిర్గతమైందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్పై కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. “అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ రాదు. కోర్టు పరిధిలో ఉన్న విషయం. క్రికెట్‌లో కట్లు కొట్టిన అజార్‌కు రాజకీయాల్లో కూడా కట్ కొట్టారు. జూబ్లీహిల్స్ నుంచి తప్పించడానికే ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించారు. మైనారిటీ ఓట్ల కోసం ఈ డ్రామా” అని అన్నారు.
కాంగ్రెస్ అధికారం రాకపోతే ప్రజలను నిందించడం తగదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “మా నాయకుడిని ప్రజలకు సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయాము, అది మా తప్పు. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపు అయ్యాయి” అన్నారు. పాద యాత్ర కు ఇంకా కొంత టైం ఉంది. ఎన్నికల కు ఇంకో మూడు ఏండ్లు ఉంది. అందుకే పాద యాత్ర కు తొందరేం లేదు. పాద యాత్ర ఉంటుంది.ప్రస్తుతానికి స్లిమ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాను. కొన్ని రోజుల నుంచి జిమ్ చేయడం కొద్దిగా ఆపేశాను’ అని కేటీఆర్ చిట్ చాట్ లో మాట్లాడారు.
KTR : ఎల్అండ్‌టి మెట్రో ప్రాజెక్టు నుంచి వెనక్కి.. సీఎం బెదిరింపులే కారణం