రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో (పంజాగుట్ట PS క్రైం నెం. 243/2024) మాజీ మంత్రి హరీష్‌రావు విచారణ పూర్తయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ విచారణపై సిట్ అధికారులు తాజాగా స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్‌రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం ఆయనను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే, ఆయన కుమారుడి ఫ్లైట్ ప్రయాణం ఉన్న కారణంగా విచారణను కొంత ముందస్తుగా ముగించవలసి వచ్చిందని సిట్…
సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది.…
HYDRAA : హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA), మియాపూర్ ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని కాపాడింది. మియాపూర్ విలేజ్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేటలో సాగుతున్న భారీ కబ్జా యత్నాలను హైడ్రా అధికారులు భగ్నం చేశారు. తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ 3 వేల కోట్ల రూపాయలకు…
చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అమానుషమైన, చట్టవిరుద్ధ చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18 టీమ్‌లను ఏర్పాటు చేసి, రైడ్లు నిర్వహించి షాకింగ్ వివరాలను వెలికితీసింది. ఆపరేషన్‌లో భాగంగా చైల్డ్ పోర్న్ వీడియోలను చూస్తూ, షేర్ చేస్తూ, డౌన్‌లోడ్ లేదా అప్లోడ్ చేస్తూ ఉన్న 24 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు హైదరాబాద్‌కు చెందినవారేనని, అరెస్ట్ అయిన వారి వయస్సు…
HYDRA Gunman: హైడ్రా కమిషనర్ వద్ద గన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హయత్‌నగర్‌లోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. భార్యతో కలిసి హయత్‌నగర్‌లో నివసిస్తున్న కృష్ణ చైతన్య తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ చైతన్య పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు…
Duvvada, Madhuri : హాట్ టాపిక్ గా మారిన ఫామ్‌హౌస్ పార్టీ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పందించారు. ఎన్టీవీతో వారు మాట్లాడుతూ.. పార్థు అనే స్నేహితుడి పార్టీకి పిలిస్తే వెళ్లామని, అక్కడ బిజినెస్ ఎక్స్పన్షాన్ గురించి మాత్రమే పార్టీ జరిగిందని వివరించారు. పార్టీలో లిక్కర్ ఉన్న మాట వాస్తవేమనని, కానీ.. పార్టీ నిర్వహించేందుకు లైసెన్స్ తీసుకోలేదని విషయం పోలీసులు వచ్చాక తెలిసిందని దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. పార్టీకి లైసెన్స్ లేదని తెలియడంతో అక్కడినుంచి వచ్చేసినట్లు…
Bhatti Vikramarka : రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూ లకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన ప్రజా భవన్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ప్రసంగించారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని తపిస్తున్న అందరికీ అభినందనలని డిప్యూటీ సీఎం…
ACB : రంగారెడ్డి జిల్లా భూ సర్వే, భూ సంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ అయిన కోతం శ్రీనివాసులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. ఆదాయానికి మించిన భారీ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసింది. శ్రీనివాసులు అక్రమ మార్గాల్లో దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. శ్రీనివాసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న మై హోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం…
Bomb Treat : షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సంఘటన ప్రయాణికులలో, విమానాశ్రయ అధికారులలో కలకలం సృష్టించింది. ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. విమానంలో “మానవ ఐఈడీ (IED)” ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి ఎలాంటి ప్రమాదం…
Indigo : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్లకు సాంకేతిక లోపాలు ఏర్పడటంతో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు బయలుదేరాల్సిన విమానాలు వరుసగా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. Fake Birth Certificate Scam: దేశవ్యాప్త నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డాగా ఏపీలోని ఆ మండలం.. చాలా మందిప్రయాణికులు నిన్నటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్ల ఆలస్యం…