DK Aruna: సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడని అనుకుంటున్నారు..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు
- కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిట్టి సీఎం అయ్యారు
- తిట్లు తిట్టి ముఖ్యమంత్రులైన వారిని ప్రజలెవరు హర్షించడం లేదు- డీకే అరుణ
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడని అనుకుంటున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని తిట్టి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. కానీ తిట్లు తిట్టి ముఖ్యమంత్రులైన వారిని ప్రజలెవరు హర్షించడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాడని అనుకుంటున్నారని డీకే అరుణ విమర్శలు గుప్పించారు. పత్రికల్లో కేవలం బ్యానర్ ఐటమ్ కోసమే రాష్ట్ర ప్రభుత్వం తాపత్రయ పడుతుంది తప్ప.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చిత్తశుద్ధి లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి పత్రికల్లో వచ్చిన బ్యానర్ ఐటమ్ వార్తలను లేవనెత్తి ప్రజలను డైవర్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Chhaava : థియేటర్లో ప్రత్యక్షమైన శంభాజీ మహారాజ్?
Also Read
కులగణనలో పాల్గొనని వారిని తెలంగాణ నుండి బహిష్కరిస్తామని అనడానికి రేవంత్ రెడ్డి ఎవరు.. ఆయనకు హక్కు ఏంటి..? అని డీకే అరుణ ఫైరయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డినే తెలంగాణ నుండి ప్రజలు బహిష్కరిస్తారని అన్నారు. కులగణన సర్వేలో వ్యక్తిగత వివరాలు, ఆస్తులతో పాటు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు అన్న వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు.. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ళలో అక్రమాలు, అవినీతి జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి భయంతో సర్వేలో పాల్గొన్నారు.. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన సర్వేను ఎందుకు బయట పెట్టడం లేదని అన్నారు. మరోవైపు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై స్పందిస్తూ.. పార్టీ హై కమాండ్ ప్రొసీజర్ ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చిన కలిసి పని చేస్తామని డీకే అరుణ చెప్పారు.
Read Also: UPSC CSE 2025: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించిన యూపీఎస్సీ
తాజావార్తలు
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
-
Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
-
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
-
Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్‌లో BLA-TTP వరస దాడులు..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!