KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం
- జనగామలో కేటీఆర్ పర్యటన.. బీఆర్ఎస్ శ్రేణుల స్వాగతం
- యశ్వంతపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
- కొనుగోలు జాప్యంపై రైతుల ఆవేదన.. మార్క్‌ఫెడ్‌కు కేటీఆర్ ఫోన్
- రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం.. ఉద్యమ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. అనంతరం జనగామ మండలంలోని యశ్వంతపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ సందర్శించారు. అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. 15 నుంచి 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
Also Read
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని, అయితే ఆ మేరకు కొనుగోలు ప్రణాళికలు రూపొందించలేదని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల పంటను మాత్రమే కొనుగోలు చేయాలని భావిస్తోందని, మిగతా పంటను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. పంటను కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడం వల్ల వర్షాల కారణంగా పంట దెబ్బతింటుందని, దీంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు.
అలాగే మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.22,000 కోట్ల అప్పులు తీసుకువచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. సివిల్ సప్లై కార్పొరేషన్‌లో జరిగిన అక్రమాల కారణంగా అక్కడి నుంచి నిధులు రాకపోవడంతో, మార్క్‌ఫెడ్ నిధులను వాడుకుంటున్నారని చెప్పారు. తాను చెప్పిన లెక్కలు తప్పైతే ప్రభుత్వం రుజువు చేయాలని సవాల్ విసిరారు.
రైతులను ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రేపటి వరకు గడువు ఇస్తున్నామని తెలిపారు. లేకపోతే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..