8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme NARZO 100x 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన నార్జో సిరీస్‌ను మరింత విస్తరించేందుకు రియల్మీ (realme) రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త realme NARZO 100x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో జూలై 15 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 8000mAh భారీ బ్యాటరీ. సాధారణ వినియోగంలో ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని రియల్మీ పేర్కొంది. అంతేకాకుండా నాలుగేళ్ల సాధారణ వినియోగం తర్వాత కూడా బ్యాటరీ సామర్థ్యం 80% కంటే ఎక్కువగా కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది. భారీ బ్యాటరీకి తోడు 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్ అందిస్తుంది. కేవలం 33 నిమిషాల్లోనే బ్యాటరీని 50% వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండటంతో ఇతర డివైస్‌లను ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
పనితీరు పరంగా ఇందులో MediaTek Dimensity 6300 5G ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. 6nm ప్రాసెస్ టెక్నాలజీపై రూపొందించిన ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరు, తక్కువ విద్యుత్ వినియోగాన్ని అందించేలా రూపొందించబడింది. రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి అవసరాలను కూడా సమర్థంగా నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంటుందని భావిస్తున్నారు.
Also Read
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
- Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
realme NARZO 100x 5Gలో 6.72 అంగుళాల 120Hz Ultra Smooth Display అందించనున్నారు. కంటెంట్‌ను బట్టి డిస్ప్లే రిఫ్రెష్ రేట్‌ను 120Hz, 90Hz, 60Hz, 50Hz, 48Hz, 45Hz స్థాయిల మధ్య ఆటోమేటిక్‌గా మార్చుకునే సదుపాయం ఉంటుంది. దీంతో ఒకవైపు స్మూత్ విజువల్ అనుభవం లభిస్తే.. మరోవైపు బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP AI మెయిన్ కెమెరా ఇవ్వనున్నారు. అలాగే మెరుగైన ఆడియో అనుభవం కోసం స్టీరియో స్పీకర్లు కూడా ఉండనున్నాయి.
ఫోన్ మన్నికను పెంచేందుకు ArmorShell Structural Protectionను అందిస్తోంది. వీటితోపాటు రైన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా ఉండటంతో చేతులు తడిగా ఉన్నా లేదా వర్షంలోనూ టచ్ స్పందన మెరుగ్గా పనిచేసేలా రూపొందించారు. లాంచ్ తర్వాత అమెజాన్ ఇండియాతో పాటు రియల్మీ అధికారిక వెబ్సైట్లో కూడా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!