Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా (Lava) ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో భాగస్వామ్యాన్ని ప్రకంటించింది. ఇందులో భాగంగా కొత్త లావా విరాట్ (Lava Virat) స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను త్వరలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ సిరీస్ ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడుతోంది.
ఇప్పటి వరకు ఆఫ్‌లైన్ మార్కెట్లో బలమైన ఉనికిని కలిగి ఉన్న లావా.. ఇప్పుడు ఆన్లైన్ విభాగంలో తన వాటాను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025లో లావా ఆన్లైన్ వ్యాపారం ఏకంగా 74% వృద్ధి నమోదు చేసింది. ఈ విజయాన్ని కొనసాగించేందుకు ఫ్లిప్‌కార్ట్ కలిసి దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త విరాట్ సిరీస్‌ను తీసుకురానుంది.
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
లావా విరాట్ సిరీస్‌లో బడ్జెట్ నుంచి మిడ్-రేంజ్ వరకు పలు మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.10 వేల లోపు బడ్జెట్ సెగ్మెంట్ నుంచి రూ.25 వేల వరకు వివిధ ధరల్లో ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 4G, 5G వేరియంట్లు కూడా అందించనున్నారు. ఈ కొత్త సిరీస్‌లో మూడు ప్రధాన అంశాలపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మొదటగా.. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందించేలా బ్యాటరీని రూపొందిస్తున్నారు. రెండవది.. మెరుగైన ఫోటోగ్రఫీ కోసం AI ఆధారిత కెమెరా ఫీచర్లు అందించనున్నారు. మూడవది.. ఆయా ధరల విభాగానికి అనుగుణంగా వేగవంతమైన పనితీరు అందించే ప్రాసెసర్లను ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
‘మేక్ ఇన్ ఇండియా’:
దాదాపు 17 ఏళ్లుగా భారతదేశంలోనే స్మార్ట్ఫోన్ల డిజైన్, తయారీ, నాణ్యత నియంత్రణపై దృష్టి సారిస్తున్న లావా.. ఈ భాగస్వామ్యం ద్వారా దేశీయంగా తయారైన స్మార్ట్ఫోన్లను మరింత విస్తృతంగా వినియోగదారులకు చేరవేయాలని భావిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బలమైన ఈ-కామర్స్ వేదిక, లాజిస్టిక్స్ నెట్వర్క్ సహకారంతో దేశవ్యాప్తంగా వేగంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించిన మోడల్ పేర్లు, పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు, రంగుల ఎంపికలు, లాంచ్ తేదీ వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే అధికారిక విడుదలకు ముందు ఈ సమాచారాన్ని దశలవారీగా ప్రకటించనున్నట్లు లావా, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!