Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- 20 రోజులుగా అలాగే ఉన్న గుంత.. ఎవరికీ పట్టలేదా?
- ఆడుకుంటూ వెళ్లి ప్రమాదంలో పడ్డ చిన్నారి
- కాపాడేందుకు దూకిన తల్లి, అక్క.. కానీ ఆలస్యమైంది
- అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం.. న్యాయం కోరుతూ ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలితీసుకుంది. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మత్తుల కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడంతో, ప్రమాదవశాత్తు అందులో పడి మోక్షిత అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట మిషన్ భగీరథ పైపులైన్ లీక్ కావడంతో, సుమారు 20 రోజుల క్రితం అధికారులు మరమ్మత్తుల కోసం 4 మీటర్ల లోతున భారీ గుంతను తవ్వారు. అయితే, మరమ్మత్తులు పూర్తయినా లేదా మధ్యలో నిలిచిపోయినా, ఆ గుంతను పూడ్చకుండా అధికారులు అలాగే వదిలేశారు. గత మూడు వారాలుగా ఆ మృత్యు గుంత పాఠశాల ముందే దర్శనమిస్తున్నా, ఏ ఒక్క అధికారి కూడా దాని భద్రత గురించి పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రంలో కవిత అనే మహిళ ఆయాగా పనిచేస్తోంది. ఆమె తన ఇద్దరు కుమార్తెలు దక్షిత , మోక్షితలను వెంటబెట్టుకుని పాఠశాలకు వచ్చింది. తల్లి లోపలికి వెళ్లిన క్రమంలో, ఆడుకుంటూ వెళ్లిన మోక్షిత ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది. పక్కనే ఉన్న అక్క దక్షిత ఈ విషయాన్ని వెంటనే తల్లికి చెప్పడంతో, కవిత పరుగులు తీస్తూ వచ్చి తన చిన్నారిని కాపాడుకునేందుకు గుంతలోకి దూకింది. కవితతో పాటు దక్షిత కూడా గుంతలోకి దూకింది.
గుంతలో మునిగిపోతున్న వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ముగ్గురినీ బయటకు తీశారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. తల్లి కవిత, అక్క దక్షిత ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఐదేళ్ల మోక్షిత అప్పటికే మృతి చెందింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ తన కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
మిషన్ భగీరథ అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే మోక్షిత ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో ఆందోళనకు దిగారు. స్కూల్ ఎదుటే అంత లోతైన గుంతను 20 రోజుల పాటు పూడ్చకుండా వదిలేయడం అధికారుల నేరపూరిత నిర్లక్ష్యమేనని వారు మండిపడుతున్నారు. తక్షణమే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని , బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలీంపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!