లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన విక్కీ కౌశల్ ఛావా గత శుక్రవారం వెండితెరపైకి వచ్చింది. మరాఠా సామ్రాజ్య రెండవ పాలకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లకు వెళ్లిన అభిమానుల వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. “ఇంతలో, ఒక వీడియో వైరల్ అవుతోంది.” ఈ “వైరల్ వీడియోలో, విక్కీ కౌశల్ పోషించిన శంబాజీ మహారాజ్ వంటి సంప్రదాయ దుస్తులు ధరించిన అభిమాని గుర్రంపై స్వారీ చేస్తూ థియేటర్‌లోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది.” వీడియోలో, అతను ‘జై భవానీ’ – ‘హర్ హర్ మహాదేవ్’ వంటి నినాదాలు చేస్తున్నాడు. ఇక మరోపక్క గుజరాత్‌లోని భరూచ్ నగరంలో సోమవారం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
READ MORE: UPSC CSE 2025: సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూ్స్.. దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించిన యూపీఎస్సీ
ఇటీవల విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా స్క్రీనింగ్ సందర్భంగా అక్కడ ఓ వ్యక్తి థియేటర్ స్క్రీన్‌ను చింపివేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడు స్క్రీన్ ను ధ్వంసం చేయడం వీడియోలలో వైరల్ అవుతోంది. మీడియా కథనాల ప్రకారం, ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఆర్కే సినిమాస్ లో సినిమా చివరి షో జరుగుతుండగా జయేష్ వాసవ అనే వ్యక్తి మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డాడని సమాచారం. ఈ చిత్రంలో ఔరంగజేబ్ – ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్య ఒక సన్నివేశం ఉంది. ఇందులో ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ ను హింసించే సీన్ బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన జయేష్ కోపంతో అదుపు చేసుకోలేక థియేటర్ స్క్రీన్‌ను పాడు చేయడం ప్రారంభించాడు. మద్యం మత్తులో స్టేజీపైకి ఎక్కి మంటలను ఆర్పే పరికరంతో స్క్రీన్‌ను పాడు చేశాడు. ఆ తర్వాత తన చేతులతో స్క్రీన్‌ని చింపేశాడు. ఈ చర్య థియేటర్‌లో భయాందోళనలకు గురిచేసింది.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్