సివిల్స్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీ్స్ ప్రిలిమినరీ పరీక్ష 2025 దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి గడువును పొడిగించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఫ్రిబ్రవరి 11 వరకు ఉన్న గడువును ఫిబ్రవరి 18కి పొడిగించింది. తాజాగా మరోసారి ఫిబ్రవరి 21కి పొడిగించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న జరుగుతుంది.
Also Read:Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ సైన్యంలో మూడో వంతు ముస్లింలే.. నమ్మశక్యంకాని నిజాలు!
అప్లికేషన్లలో పొరపాట్లు ఉంటే ఫిబ్రవరి 22-28 వరకు సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా గతనెలలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అఖిలా భారత సర్వీసుల్లో 979 పోస్టులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో 150 పోస్టులు భర్తీచేయనున్నారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.