Bandi Sanjay: బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: జగిత్యాల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ పాదయాత్ర 11వ రోజు కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ విడి నుండి బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర” ప్రారంభమైంది. ఈ పాదయాత్ర సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట మీదుగా వేంపేట వరకు కొనసాగనుండగా.. బండి సంజయ్ వేంపేట సమీపంలో రాత్రి బస చేయనున్నారు. బండి సంజయ్ పాదయాత్ర ఈరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈసందర్బంగా మాట్లాడుతూ.. బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కాం తో దోచుకుందని ఆరోపించారు. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. సారా దందాతో పాటు క్యాసినోలో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఇక్కడ ఉపాధి లేపకపోవడంతో గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే.. గల్స్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ లో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Sajjala Ramakrishna Reddy : దింపుడు కళ్లెం ఆశతో జగన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు సృష్టిస్తున్నారు
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
గుజరాత్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వాన్ని ఓడించక తప్పదన్నారు. అభివృద్ధి చేసే వారే గెలుస్తారని బండి సంజయ్ అన్నారు. అవినీతిపరులు పతనం అవుతారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్ లో గతంలో కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి సంతోషంగా ఉందని అన్నారు. ఫలితాల కోసం ప్రపంచం దృష్టంతా గుజరాత్ మీదే ఉందని తెలిపారు. అన్ని పార్టీలు ఒకటై మోడీ గారి ఇమేజ్ను బ్యాడ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. బీజేపీకి అధికారం ఇస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో గుజరాత్ ఫలితాలు తెలుపుతున్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోయే రోజుల్లో విజయ పరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుజరాత్ గురించి చాలాసార్లు మాట్లాడారు ఏమి అభివృద్ధి అని అన్నాడు స్పందన చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని సంతోషం వ్యక్తం చేశారు. మునుగోడులో ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పనిచేసిన మెజార్టీ లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
Data Theft: 6 లక్షల మంది భారతీయుల డేటా దొంగిలించి, అమ్మకం
తాజావార్తలు
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి