Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Intelligent Eyewear: శాంసంగ్ నుండి ఇంటెలిజెంట్ ఐవేర్ (Intelligent Eyewear)ను అధికారికంగా లాంచ్ చేసింది. లండన్‌లో జరిగిన Galaxy Unpacked ఈవెంట్లో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేసింది. గూగుల్‌తో భాగస్వామ్యంలో తయారుచేసిన ఈ డివైస్‌లో గూగుల్ జెమిని AIను జతపరచడం ద్వారా చేతులు ఉపయోగించకుండా (Hands-free) అనేక AI ఫీచర్లను వినియోగించే అవకాశం కల్పించింది. ఈ ఇంటెలిజెంట్ ఐవేర్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఐవేర్ బ్రాండ్లు జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్ తో కలిసి శాంసంగ్ అభివృద్ధి చేసింది.
స్టైలిష్ డిజైన్:
Samsung Intelligent Eyewear తక్కువ బరువు, స్లిమ్ ఫ్రేమ్, ఎక్కువ మన్నిక, రోజంతా ధరించేందుకు అనువైన కంఫర్ట్‌తో తయారైంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ ఫ్రేమ్ డిజైన్లు, రంగులు, లెన్స్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చింది. “జెంటిల్ మాన్స్టర్ ఎడిషన్” బ్లాక్ కలర్ స్లిమ్ ఫ్రేమ్, స్ట్రైట్ అప్పర్ రిమ్, రౌండెడ్ ఎడ్జ్‌లతో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. ఇంకా “వార్బీ పార్కర్ ఎడిషన్” బ్రౌన్ కలర్ ఫ్రేమ్‌తో పాటు కాస్త పైకి లేచిన బ్రో లైన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
Also Read
- TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
AIతో స్మార్ట్ అనుభవం:
వీటిలో గూగుల్ జెమిని AI ని జోడించడంతో.. వాయిస్ కమాండ్లు, టచ్ కంట్రోల్స్, జెశ్చర్ల ద్వారా యూజర్లు సులభంగా వీటిని నియంత్రించవచ్చు.
ఈ AI గ్లాసెస్‌లో లభించే ముఖ్యమైన ఫీచర్లు:
* పొడవైన మెసేజ్‌లను సంక్షిప్తంగా చదివి వినిపించడం.
* రియల్‌టైమ్ లైవ్ ట్రాన్స్లేషన్ ద్వారా ఇతర భాషల్లో కమ్యూనికేషన్‌కు సహాయం.
* కెమెరా ద్వారా కనిపించే వైట్‌బోర్డులు, మీటింగ్ నోట్స్ వంటి సమాచారాన్ని క్యాప్చర్ చేసి Notesలో సేవ్ చేయడం.
* లొకేషన్ ఆధారిత సమాచారం, దారి చూపించడం, సమీప ప్రాంతాల వివరాలు అందించడం.
* వీడియో కాల్స్ సమయంలో తాము చూస్తున్న దృశ్యాలను లైవ్‌గా షేర్ చేయడం.
* ఫస్ట్-పర్సన్ వ్యూ వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడం.
* యూజర్ కాంటెక్స్ట్ను గుర్తించి అవసరమైన సమాచారాన్ని ఆటోమేటిక్‌గా అందించడం.
ప్రాసెసర్ & బ్యాటరీ:
ఈ స్మార్ట్ గ్లాసెస్‌కు Qualcomm Snapdragon AR1 Gen1 Platform ప్రాసెసర్ ఉంది. ఇది రియల్‌టైమ్ AI ప్రాసెసింగ్, పవర్ ఎఫిషియెన్సీ, టచ్ ఇంటరాక్షన్, కనెక్టివిటీ, హీట్ మేనేజ్మెంట్ వంటి అంశాలను సమర్థంగా నిర్వహిస్తుంది. ఇందులో ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 9 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఇంకా ఛార్జింగ్ కేస్ ద్వారా మరో 7 పూర్తి ఛార్జ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ధర, ఏయే దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలను వెల్లడించలేదు.

- Tags
తాజావార్తలు
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?