2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలు తమ విడుదల తేదీలను భారీగా మార్చుకుంటున్నాయి. 2025, 2026 లలోనే థియేటర్లలో సందడి చేయాల్సిన పలు భారీ చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్ పనులు, మేకింగ్ ఆలస్యం మరియు డేట్ల సర్దుబాట్ల కారణంగా ఏకంగా 2027 కి వాయిదా పడుతున్నాయి. దీంతో 2027 నాటికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
రెబెల్ స్టార్ ప్రభాస్, ‘యాక్షన్ సెన్సేషన్’ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ కాప్ డ్రామా ‘స్పిరిట్‘. వాస్తవానికి ఈ సినిమా 2026లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా సందీప్ వంగ ‘డార్లింగ్’ కాల్షీట్స్ కోసం ఏడాదిపాటు ఓపికగా ఎదురుచూశారు. చివరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ రిలీజ్ డేట్ రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చుకుని 2027 జూన్ 11 వాయిదా వేశారు. మరోవైపు గ్రాండ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక విజువల్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్న ‘రాకా‘ సినిమా టీమ్ మాత్రం రిలీజ్ డేట్ ప్రకటించాలంటేనే కాస్త ఆలోచిస్తోంది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ విపరీతంగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ‘రాకా’ చిత్రం 2027 డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘NBK 111’ షెడ్యూల్‌కి ఊహించని విరామం ఇచ్చాల్సి వచ్చింది. షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో ఆయన నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ముందుగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ఈ గ్యాప్ వల్ల సినిమా ఏకంగా 2027 కి వెళ్లే అవకాశం ఉంది. ఇక రాబోయే సంక్రాంతి బాక్సాఫీస్ రేసు సైతం ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి దర్సకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ మల్టీస్టారర్ సినిమా ఉండగా, అదే పండక్కి మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పోటీ పడటానికి సిద్ధమవుతున్నాయి.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!