గల్ఫ్ కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. గల్ఫ్ వర్కర్స్‌కు ఐదులక్షల పరిహారం ప్రకటిస్తూ ప్రభుత్వం గైడ్‌లైన్స్ విడుదల చేసింది. గల్ఫ్‌కి వెళ్లి చనిపోయిన కార్మికుడికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి లో గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన…
రైతు బీమా తరహాలో.. గల్ఫ్ కార్మికుల బీమా అందిస్తామని ప్రకటించారు. ఇందులో గల్ఫ్ కార్మికుల ప్రమాద భీమా రూ. 5 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విభాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తాం అని తెలిపారు. జూన్, జులైలో పాలసీ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు.
బీజేపీ అధికారం లోకి వస్తే.. గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కాం తో దోచుకుందని ఆరోపించారు. కవిత జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.