IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
- హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్
- బలమైన ఆరంభం చేయాలని చూస్తోన్న టీమిండియా
- వైభవ్ సూర్యవంశీపై అందరి చూపు
- జింబాబ్వేను తక్కువ అంచనా వేయరాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Zimbabwe 1st T20 Playing XI: టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక తీవ్ర నిరాశకు గురైన టీమిండియా.. జింబాబ్వే పర్యటనలో అయినా విజయాల బాట పట్టాలని భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం (జూలై 23) హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరుస పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారత జట్టు.. ఈ సిరీస్‌లో బలమైన ఆరంభం చేయాలని చూస్తోంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న జింబాబ్వే కూడా భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
వైభవ్ సూర్యవంశీపై అందరి చూపు:
ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అభిమానుల దృష్టి నిలిచింది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులోకి వచ్చిన వైభవ్.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 42 పరుగులే చేశాడు. సంజు శాంసన్ ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడంతో వైభవ్‌కు మరోసారి ఓపెనర్‌గా వరుస అవకాశాలు దక్కనున్నాయి. ఈసారి తన సహజమైన దూకుడు ఆటతో సత్తా చాటాలని భావిస్తున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది.
Also Read
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన మైలురాయి.. మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డు..
- Rohit Yadav: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్‌పై రెండేళ్ల నిషేధం..
- BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
మిడిల్ ఆర్డర్‌పై కీలక బాధ్యత:
వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ టాప్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించనున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలు మిడిల్ ఆర్డర్లో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకోనున్నారు. రింకూ సింగ్, శివమ్ దూబే ఫినిషర్లుగా ఆడనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో బ్యాటింగ్ విభాగం విఫలమైన నేపథ్యంలో ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
యువ బౌలర్లకు పరీక్ష:
బౌలింగ్ విభాగంలో టీమిండియా పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ కొత్త బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. వీరితో పాటు యశ్ ఠాకూర్ లేదా అశోక్ శర్మలో ఒకరు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. స్పిన్ బాధ్యతలను హర్ష్ దూబే నిర్వహించనున్నాడు. యువ బౌలర్లకు ఇది తమ ప్రతిభను నిరూపించుకునే కీలక అవకాశం.
జింబాబ్వేను తక్కువ అంచనా వేయరాదు:
జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ టీ20ల్లో ప్రమాదకర ప్రత్యర్థి అనే చెప్పాలి. కెప్టెన్ సికందర్ రజా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. అతడితో పాటు బ్రయాన్ బెనెట్, ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు. బౌలింగ్‌లో బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ ఎంగరవ వంటి పేసర్లు భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. ఐర్లాండ్ మాదిరి జింబాబ్వేను లైట్ తీసుకుంటే మరో ఓటమి తప్పదు.
పిచ్, వాతావరణం:
హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ ఆరంభంలో పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సాగేకొద్దీ బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగా మారుతుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, జింబాబ్వే తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈరోజు సాయంత్రం 4:30 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. యునైట్8 స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ ఛానెల్లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటు ఉంటుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
భారత్, జింబాబ్వే జట్లు ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 11 విజయాలు సాధించగా.. జింబాబ్వే మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. జింబాబ్వే వేదికగా జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో భారత్ ఆరు, ఆతిథ్య జట్టు మూడు విజయాలు నమోదు చేశాయి.
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్/అశోక్ శర్మ.
జింబాబ్వే: బ్రయాన్ బెనెట్, తడివనాషే మరుమాని, వెస్లీ మధేవెరే/డియాన్ మేయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, వెల్లింగ్టన్ మసకద్జా, మిల్టన్ షుంబా, న్యూమన్ న్యామ్హురి, రిచర్డ్ ఎంగరవ, బ్లెస్సింగ్ ముజరబాని.
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!