Talasani Srinivas: లా అండ్ ఆర్డర్ లేకపోతే.. మీ వాళ్ళు తిరిగే వాళ్ళా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లా అండ్ ఆర్డర్ మాది లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. బీజేపీ కేంద్రం ఏమిచ్చిందో శ్వేతా పత్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణ లో ఆలయాల గురించి మాట్లాడారు కదా.. మరి దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు తలసాని. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిడ్గం కొనసాగుతూనే వుందని అన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్ తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. మీ డబుల్ ఇంజన్ సర్కార్ లో ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి సాగుతోందని ప్రశ్నించారు.
read also: COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు
Also Read
టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న బీజేపీ సభలో మా బల్కంపేట టెంపుల్ కి వచ్చిన మంది రాలేదంటూ ఎద్దేవ చేశారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి మోడీ ఒక్క సమాధానం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. టెక్స్ట్ టైల్ పార్క్ అన్నారు ఇచ్చారా? కోచ్ ఫేక్టరీ ఇచ్చారా అంటూ మండిపడ్డారు. అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని నిప్పులు చెరిగారు. బీజేపీ ని బలోపేతం చేయలంటే కేంద్రం ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు తలసాని. దేశం నుండి బీజేపీ ప్రభుత్వం పోవాలని అన్నారు. మూడేళ్లనుండి ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎన్ని సార్లు వచ్చాడు? అభివృద్ధి చేశాడా అంటూ ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు టీఆర్ ఎస్ చేయదని, మోడీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!