Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు
- 11వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు
- మహిళలకు గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Budget 2026: తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో మహిళలు, విద్యార్థులు, యువత, పేద కుటుంబాలు, రైతులు, ఆరోగ్యం, విద్య, పర్యావరణం వంటి రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు చేసింది. మహిళల కోసం బంగారు నాణేలు, పట్టు చీరల పథకం ప్రతిపాదించడంతో పాటు, Gen-Z విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సైకిళ్ల పంపిణీకి ప్రభుత్వం భారీ మొత్తాన్ని కేటాయించింది. అలాగే హజ్ యాత్రకు వెళ్లే వారికి అందించే సబ్సిడీని కూడా పెంచనున్నట్లు ప్రకటించింది.
11వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు
ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో చదువుతున్న 11వ తరగతి విద్యార్థులకు ఆధునిక సైకిళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సైకిళ్లతో పాటు విద్యార్థులకు హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు కూడా అందించనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.277 కోట్లు ఖర్చు చేయనుంది. యువతలో ఆరోగ్యం, ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించడమే ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
మహిళలకు గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు
మహిళల కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన మహిళలకు బంగారు నాణేలు, పట్టు చీరలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పథకం కోసం రూ.812 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొన్నారు.
హజ్ సబ్సిడీ పెంపు
హజ్ యాత్రకు వెళ్లే వారికి అందిస్తున్న సబ్సిడీని కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రూ.25,000 సబ్సిడీని రూ.35,000కు పెంచనున్నట్లు ప్రకటించింది. తొలిసారి హజ్ యాత్రకు వెళ్లే వారికి ఈ పెంపు వర్తించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
NEETపై ప్రభుత్వ వైఖరి
NEET పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం తన వ్యతిరేక వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. NEETను రద్దు చేసి, గతంలో ఉన్న విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించే విధానాన్ని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం కోరింది.
టెండర్లలో పారదర్శకతకు ప్రాధాన్యం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ టెండర్లలో అక్రమంగా వాటాలు లేదా లంచాలకు అవకాశం లేకుండా పారదర్శకత తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం ద్వారా ప్రభుత్వ ఖర్చులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
10 ఒలింపిక్ ప్రత్యేక కేంద్రాలు
యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10 ఒలింపిక్-ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అదనంగా, రూ.42 కోట్ల వ్యయంతో తమిళనాడు గ్రామీణ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. యువత క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.
పర్యావరణానికి రూ.1,762 కోట్లు
పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడం, అటవీ సంరక్షణకు తమిళనాడు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. పర్యావరణం, వాతావరణ మార్పు, అటవీ శాఖకు రూ.1,762 కోట్లు కేటాయించారు.
పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం
కచ్చా ఇళ్లను పక్కా ఇళ్లుగా మార్చేందుకు అందించే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.3.10 లక్షలుగా ఉన్న సహాయాన్ని రూ.5 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘వీడు వెట్టి’ పథకం కింద రూ.3,500 కోట్ల వ్యయంతో 70,000 పక్కా ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తమిళనాడు బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు
గృహ మరియు పట్టణాభివృద్ధి శాఖ-రూ.8,852 కోట్లు
విద్యుత్ శాఖ-రూ.15,828 కోట్లు
చేనేత మరియు వస్త్ర పరిశ్రమల శాఖ-రూ.1,678 కోట్లు
పరిశ్రమల శాఖ-రూ.4,414 కోట్లు
MSME శాఖ-రూ.2,142 కోట్లు
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ-రూ.4,880 కోట్లు
సహకార శాఖ-రూ.8,028 కోట్లు
ఆరోగ్య శాఖ-రూ.23,357 కోట్లు
సామాజిక సంక్షేమ శాఖ-రూ.9,818 కోట్లు
దివ్యాంగుల సంక్షేమ శాఖ-రూ.1,485 కోట్లు
యువత, మహిళలు, పేదలపై ఫోకస్
తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో యువత, విద్యార్థులు, మహిళలు, పేద కుటుంబాలు, ఆరోగ్యం, పర్యావరణం, క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 11వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, మహిళలకు గోల్డ్ కాయిన్స్, పట్టు చీరల పథకం, హజ్ సబ్సిడీ పెంపు, పక్కా ఇళ్ల నిర్మాణం, ఒలింపిక్ కేంద్రాల ఏర్పాటు వంటి ప్రకటనలు ఈ బడ్జెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తాజావార్తలు
-
Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
-
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!