రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్‌లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- ది హండ్రెడ్ 2026లో పరుగుల వరద
- ఒక్క మ్యాచ్‌లో 445 పరుగులు, 31 సిక్సర్లు నమోదై కొత్త రికార్డు.
- సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 2 వికెట్లకు 241 పరుగులు
- లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 204/6 స్కోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Hundred: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ (The Hundred) టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్, లండన్ స్పిరిట్ మధ్య ఆగస్టు 4న జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్సర్లు, 445 పరుగులు నమోదై కొత్త రికార్డులు నెలకొన్నాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ లీడ్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, రయాన్ రికెల్టన్ చెలరేగడంతో పలు రికార్డులు బద్దలయ్యాయి.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, రయాన్ రికెల్టన్ అదిరిపోయే ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున ఏ వికెట్‌కైనా నమోదైన అత్యధిక భాగస్వామ్యం. ఇదివరకు ఉన్న 111 పరుగుల రికార్డును వీరు బద్దలు కొట్టారు.
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
మిచెల్ మార్ష్ కేవలం 37 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు, 205.4 స్ట్రైక్‌రేట్ తో 76 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. మరోవైపు రయాన్ రికెల్టన్ మరింత దూకుడుగా 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు, 223.8 స్ట్రైక్‌రేట్ తో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరి మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు హ్యారీ బ్రూక్ 18 బంతుల్లో 5 సిక్సర్లతో 55 పరుగుల ధనాధన్ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోరు చేసింది.
242 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్‌కు మొదట్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 26 బంతుల్లోనే 56 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత డేవిడ్ విల్లీ ఒంటరి పోరాటం చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 46 బంతుల్లో అజేయంగా 83 పరుగులు చేసినా జట్టును విజయానికి చేర్చలేకపోయాడు. చివరకు లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 6 వికెట్లకు 204 పరుగులు మాత్రమే చేసి 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ 21 సిక్సర్లు, లండన్ స్పిరిట్ 10 సిక్సర్లు బాదాయి. మొత్తంగా 31 సిక్సర్లు నమోదయ్యాయి. అలాగే ఇరు జట్లు కలిపి 445 పరుగులు చేయడం ద్వారా సన్‌రైజర్స్ లీడ్స్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో అత్యధిక పరుగుల రికార్డు నెలకొంది.
తాజావార్తలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!