దేశంలో కరోనా కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో పాటు ఇటీవల తెలంగాణలో కూడా కొన్ని రోజుల నుంచి 400కు పైగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే పాజిటివిటీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల కరోనా వల్ల మరణాలను మాత్రం అదుపు చేయగలుగుతున్నాం.
తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 24 మంది మహమ్మారి బారినపడి మరణించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,13,864కి చేరుకుంది. గడిచిన ఒక్కరోజులు కరోనా నుంచి 13,958 కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 4.85గా నమోదు అయింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు 5,25,223 మరణించారు. 4,28,79,477 నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల శాతం 1.21 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది.
Read Also: Naresh Pavithra Lokesh: నరేష్ కు విడాకులు ఇవ్వను..? రమ్య శపథం!
మరోవైపు దేశంలో నిన్న ఒక్క రోజు 1,78,383 వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశంలో అర్హులైన వారికి 1,97,98,21,197 కరోనా వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చారు. ఆదివారం రోజు 3,32,978 టెస్టులు చేశారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతోంది. తాజాగా డబ్ల్యూ హెచ్ వో తెలిపిన దాని ప్రకారం ప్రపంచంలో 110 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో 55,43,43,968 మంది కరోనా బారిన పడ్డారు. 63,61,372 మరణాలు సంభవించాయి.