Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ కాటేదాన్ పరిధిలో హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. అత్యంత ప్రమాదకరమైన రీతిలో నకిలీ, కల్తీ మసాలా దినుసులను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేస్తూ భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో అధికారులు 25 టన్నుల నకిలీ మసాలా దినుసులతో పాటు, తయారీకి సిద్ధంగా ఉంచిన మరో 89 టన్నుల కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యం వాడే జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు, మెంతులు, సోంపు మరియు చిన్న ఆవాలను ఈ ముఠా రసాయనాలతో కల్తీ చేస్తోంది. ముఖ్యంగా బట్టలకు రంగులు అద్దేందుకు వాడే అత్యంత ప్రమాదకరమైన ఫ్యాబ్రిక్ డై (Fabric Dye)లను ఈ మసాలాల తయారీకి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లవంగాల నుంచి నూనె తీసేసిన తర్వాత మిగిలే నాసిరకం చెత్తను సేకరించి, దానికి హానికర కేమికల్స్ కలిపి ప్రాసెస్ చేస్తున్నారు. అనంతరం వాటిపై ప్రముఖ బ్రాండెడ్ ముద్రలు వేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ కల్తీ ప్రాసెసింగ్ కోసం ఇండోర్ నుంచి ప్రత్యేకమైన యంత్రాలు, పరికరాలను తెప్పించి మరీ వ్యాపారం సాగిస్తున్నట్లు తేలింది. తక్కువ ధరలకే లభిస్తున్నాయనే ఆశతో స్థానిక మార్కెట్ల ద్వారా వీటిని విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ముఠాపై అధికారులు తీవ్ర స్థాయిలో చర్యలకు ఉపక్రమించారు.
ఈ దాడుల వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడిస్తూ, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి నిత్యం వాడే మసాలాలకు రంగు, మెరుపు తీసుకురావడానికి ఇండస్ట్రియల్ ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్స్, కొన్ని చోట్ల ఏకంగా హెయిర్ కలర్ కూడా ఉపయోగిస్తున్నారని సీపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి కేమికల్ కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలకు కాలేయం, మూత్రపిండాల సమస్యలతో పాటు క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, తీవ్రమైన అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపామని, ఆహార భద్రతా చట్టం కింద కల్తీదారులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. హెచ్-ఫాస్ట్ రూపుదిద్దుకున్న 140 రోజుల్లోనే ఇప్పటివరకు 659 ప్రాంతాల్లో దాడులు జరిపి, 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, మొత్తం 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద ఆహార పదార్థాలు లేదా కల్తీ తయారీ కేంద్రాలను గమనిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా సీపీ కోరారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?