ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్.. ఇజ్రాయిల్ శనివారం ఇరాన్‌పై విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. సరిహద్దులో ఇరాన్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత ఇజ్రాయిల్ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో తేలికపాటి వార్‌హెడ్‌లను ఉపయోగించాయని ఇరాన్ సైన్యం తెలిపింది. అయితే, ఈ దాడిపై అమెరికన్ నిపుణులు విశ్లేషించారు. ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్‌కి చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఫెసిలిటీలపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలోని…
హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. talasani about rains in hyderabad, breaking news, latest news, telugu news, big news, talasani srinivas, hyderabad rains
Talasani Srinivas: నంది అవార్డులు అడిగిన వారికి ఇవ్వడం లేదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నంది అవార్డుల అంశంపై తలసాని స్పందించారు.
హైదరాబాద్ లో బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు భాగ్యనగరంలో ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మహంకాళి ఆషాఢ బోనాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో.. చరిత్రాత్మక హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ఆరంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. అయితే.. గోల్కొండ కోటపై జగదాంబికా అమ్మవారికి మూడు వారాలుగా బోనాల ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి…
లా అండ్ ఆర్డర్ మాది లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ శ్రేణులపై మండిపడ్డారు. బీజేపీ కేంద్రం ఏమిచ్చిందో శ్వేతా పత్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణ లో ఆలయాల గురించి మాట్లాడారు కదా.. మరి దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు తలసాని. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిడ్గం కొనసాగుతూనే వుందని అన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్ తోనే అన్నీ…
ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నాని ఆయన గుర్తు చేశారు. బోనాల సందర్భంగా జగదాంబ మహంకాళి…
మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ హెల్త్ కార్డ్స్ పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావును గుర్తు చేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో తన గురించి ఆయన ఒక మంచి ఆర్టికల్ రాయడంతో పొంగిపోయానని, ఆ తరువాత పసుపులేటి రామారావును కలిసి ఏదైనా బహుమతి ఇద్దామనుకుంటే, ఆయన సున్నితంగా తిరస్కరించారని, ఇలాంటి వాటికోసం ఆర్టికల్ రాయలేదని,…
సృష్టిలో తల్లి జన్మనిస్తుంది. కానీ అవయవదానం చేసేవారు పునర్జన్మను ఇచ్చినట్టే. ఈమధ్యకాలంలో అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతోంది. అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని. అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతలను స్మరించుకోవాలన్నారు. అవయవదానంతో 3800 మంది పునర్జన్మ పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…
దేశంలోనే ప్రగతి పథంలో ప్రయాణిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఖైరతాబాద్ ఇందిరా నగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ళ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రులు కేటీఆర్,తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో పేద ప్రజలు ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ళు కేసీఆర్ ఇస్తున్నారన్నారు మంత్రి కేటీఆర్. భారత దేశం లో ఎక్కడ లేని విధంగా ఒక్క హైద్రాబాద్ లోనే 9714 కోట్లు రూపాయలతో ఇళ్ళు కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం లో కట్టిన ఇళ్ళు డబ్బా…