Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Launches Dial 112: తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవల వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు నాంది పడింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘డయల్ 100’ స్థానంలో ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని అత్యవసర సేవలకు ఒకే నంబర్‌గా ‘112’ అందుబాటులోకి రానుంది. “వన్ నేషన్.. వన్ ఎమర్జెన్సీ నంబర్” భావనతో రూపొందించిన ఈ ఏకీకృత అత్యవసర స్పందన వ్యవస్థను రాష్ట్ర డీజీపీ సీ.వీ. ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక (ఫైర్), విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్), మహిళల రక్షణ వంటి అత్యవసర సేవలన్నింటినీ ఈ ‘డయల్ 112’ ద్వారా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదాలు, గొడవలు, దోపిడీలు, వేధింపులు లేదా ఇతర ప్రమాదకర సమయాల్లో ఈ నంబర్‌కు కాల్ చేస్తే తక్షణమే సంబంధిత సహాయం అందుతుంది. ఈ నూతన వ్యవస్థను హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అత్యాధునిక కాల్ మానిటరింగ్ సిస్టమ్‌తో అనుసంధానించారు. బాధితులు 112కి కాల్ చేయగానే సిస్టమ్ ద్వారా వారి లొకేషన్‌ను తక్షణమే గుర్తించి, సమీపంలో ఉన్న పెట్రోలింగ్ లేదా అత్యవసర బృందాలకు సమాచారాన్ని చేరవేస్తారు. పరిస్థితిని బట్టి తక్షణమే ఇతర అత్యవసర విభాగాలను కూడా అనుసంధానించి వేగంగా సాయం అందించేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
ఇదిలా ఉండగా.. ఈ మార్పు ప్రజలకు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. అత్యవసర సమయంలో వివిధ నంబర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ రకమైన ఆపద వచ్చినా.. ఒకే నంబర్‌కు కాల్ చేయడం ద్వారా పోలీసులు, అగ్నిమాపక దళం, వైద్య సిబ్బంది, ఇతర సంబంధిత అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో కీలకమైన సమయాన్ని ఆదా చేస్తుంది. మరోవైపు, తెలంగాణ పోలీస్ శాఖ ఈ నూతన వ్యవస్థపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. సోషల్ మీడియా మాధ్యమాలు, ఇతర ప్రసార సాధనాల ద్వారా ‘ Dial 112 ’ ప్రాముఖ్యతను, వినియోగాన్ని వివరిస్తారు.
Also Read
- World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
- Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
తాజావార్తలు
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?