GHMC: మాన్సూన్ ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వి కర్ణన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచనలు జారీ చేశారు. నాలాల డీ సిల్టింగ్ పనుల పురోగతి, వాటర్ లాగిన్ పాయింట్లు, వర్షాలతో సంభవించే సంక్షోభ పరిస్థితుల పరిష్కారంపై అధికారులు చర్చించారు.. వాటర్ లాగింగ్ పాయింట్లకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ సమన్వయంతో పని చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు.
Read Also: Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ను అవసరం మేరకు ఏర్పాటు చేయాలన్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వీ కర్ణన్. మొబైల్ రెస్పాన్స్ టీమ్ వాహనానికి జీహెచ్ఎంసీ లోగోతో సైనేజీ బోర్డు పెట్టాలని.. అలాగే, వారి ఫోన్ నెంబర్లను అన్ని పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ముందస్తుగా ప్లాన్ సిద్ధం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు.