హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల ఆకస్మిక వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. అమాంతంగా వరదలు సంభవించడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో కొందరు ప్రాణాలు కాపాడుకోగా.. ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు 87 మంది చనిపోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు.
Heavy Rain: హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్‌పల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, అమీర్‌పేట, టోలిచౌకి, బీరంగూడ, పటాన్ చెరువు, బీహెచ్ఈఎల్, షేక్ పేట్, మెహిదీపట్నం, లంగర్ హౌస్, కోఠి, గచ్చిబౌలి, అత్తాపూర్ లాంటి ప్రాంతాల్లో వర్షానికి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది.
Telangana Rains : తెలంగాణలో వర్షాల హడావుడి మొదలైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరించడంతో వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రధానంగా దక్షిణ , పశ్చిమ తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల…
Rains : తెలంగాణలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. జూన్ 15 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, గురువారం నాటి వాతావరణ సూచనల ప్రకారం, కనీసం 10 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు…
Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 9) నాడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు…
నైరుతి రుతుపవనాలు "షార్ట్ బ్రేక్" తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించింది. దీంతో వర్షాలు ముఖం చాటేయగా వాతావరణం నిప్పులు కుంపటిగా మారింది. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ జనం అల్లాడి పోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతలు కోస్తాజిల్లాలను ఉడికెత్తిస్తున్నాయి.
Weather Updates : తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు పూర్తిగా కవర్ చేశాయని రాష్ట్ర వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు, వడగండ్ల వాన కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని…
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఇక ముంబైలో కొత్తగా ప్రారంభించిన వర్లి భూగర్భ మెట్రో స్టేషన్ వరదల్లో మునిగిపోయింది.
Monsoon : తెలంగాణలో వర్షాకాలం త్వరితగతిన ప్రారంభమవుతోంది. సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon), ఈసారి అంచనా వేసిన సమయానికంటే ముందుగానే రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ, రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద విస్తరించే అవకాశముంది. ఈ పరిణామం రైతులకు ఉత్సాహాన్నివ్వడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి లభ్యత, నీటి వనరుల నిల్వ, పౌర…