Samantha : సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మించిన తాజా మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె నిర్మించిన ఈ మూవీని ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సమంత మాట్లాడుతూ మూవీ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా చూస్తే నాకు నిర్మాత కష్టాలు అర్థం అవుతున్నాయి. యాక్టర్స్ గా ఎంత సక్సెస్ ఉంటుందో చూశాను. కానీ నిర్మాతగా సక్సెస్ అవడం చాలా కష్టంగా అనిపిస్తోంది.
Read Also : Traffic Restrictions: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
శుభం మూవీని చూసినప్పుడు నాకు మా సమ్మర్ హాలిడేస్ గుర్తుకు వచ్చాయి. చిన్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లాలంటే చాలా కష్టంగా అనిపించేది. మాకు సినిమాలు చూపించడానికి మా అమ్మ ఎంత కష్టపడేదో నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ అంతా కలిసి చూసేవిగా ఉంటాయి. ప్రేక్షకులను మంచి సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే ట్రాలాలా ముఖ్య ఉద్దేశం. ఈ మూవీని ప్రవీణ్ అద్భుతంగా తీశారు.
మూవీ టీమ్ అంతా రిలీజ్ కు మూడు రోజులు ముందు వరకు నిద్ర పోలేదు. అదే వారి కష్టాన్ని నాకు గుర్తు చేస్తోంది. అలాంటి అద్భుతమైన మూవీ టీమ్ నాకు దొరికింది. ప్రవీణ్ ఈ బ్యానర్ లో ఎప్పటికీ ఉంటారు. ఆయనతో ముందు ముందు కూడా సినిమాలు చేస్తాం. ఈ సినిమాను మీ ఫ్యామిలీతో కలిసి చూడండి’ అంటూ తెలిపింది సమంత.
Read Also : VI Anand : హనుమాన్ నిర్మాతతో వి.ఐ.ఆనంద్ మల్టీ స్టారర్